Jagan-Chiru : సీఎం జగన్ కి మరోసారి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా..

Jagan-Chiru : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. కరోనా లాక్డౌన్ కాలంలో అష్టకష్టాలు పడ్డ టాలీవుడ్ ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ రాయితీలు కల్పిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఇండస్ట్రీ తరఫున చిరు మొదటిసారిగా స్పందించారు. మొన్న కర్నూలు ఎయిర్ పోర్ట్ కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినప్పుడు కూడా ప్రశంసించారు. ఇవాళ మంగళవారం ఆ కొవిడ్ రాయితీల నిర్ణయానికి సంబంధించి వైఎస్సార్సీపీ గవర్నమెంట్ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో మెగాస్టార్ మళ్లీ స్పందించి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఏపీ సర్కారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మేలు చేసే చర్యలు తీసుకున్నా పవన్ కళ్యాణ్ అప్పట్లో రియాక్ట్ కాలేదు. ఒక పొలిటికల్ పార్టీ(జనసేన)కి అధ్యక్షుడిగా కాకపోయినా కనీసం ఒక పెద్ద హీరోగా అయినా పవర్ స్టార్ సీఎం జగన్ కి థ్యాంక్స్ చెబితే బాగుండేది. చివరికి ఆయన చిన్న సోదరుడు నాగబాబు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్స్ మహేశ్ బాబు, మంచు విష్ణు తదితర చాలా మంది కథానాయకులు, టాలీవుడ్ పెద్దలు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ ని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. ఇప్పుడు కూడా రియాక్ట్ అవుతారేమో చూడాలి.

Jagan-Chiru : megastar chiranjeevi once again thankful to ap cm ys jagan
Jagan-Chiru : megastar chiranjeevi once again thankful to ap cm ys jagan

‘మెగా’ మనసు..

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకప్పుడు రాజకీయ నాయకుడే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి వివిధ కారణాల వల్ల దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ప్రస్తుతం పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. అయినా ప్రజలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు, అందరికన్నా ముందు తన అభిప్రాయాన్ని మొహమాటంలేకుండా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకించారు. రాజకీయ పార్టీ ఏదైనా కావొచ్చు. అది మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతిస్తున్నారు. చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే తప్పుపడుతున్నారు. తద్వారా ప్రజాప్రయోజనాల విషయంలో మెగాస్టర్ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. మాటలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి సినీ కార్మికులకు పోయినేడాది నిత్యవసర సరుకులు అందించారు. ఇప్పుడు ఉచితంగా టీకాలు వేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ట్వీట్ లో ఏముంది?: Jagan-Chiru

‘‘గౌరవనీయులైన సీఎం వైఎస్ జగన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. కొవిడ్ వంటి కఠిన సమయాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి మీరు చేపట్టిన ఉపశమన చర్యలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా పరిశ్రమ పట్ల సానుభూతితో మీరు అందించిన మద్దతు ఈ రంగంపై ఆధారపడ్డ వేల కుటుంబాలకు సాయంగా నిలుస్తుంది’’ అని మెగాస్టార్ ఇవాళ మంగళవారం రాత్రి 8 గంటలకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడైనా స్పందిస్తారో లేదో.

Advertisement