YS Jagan : 175 విషయంలో వైఎస్ జగన్ అస్సలు తగ్గట్లేదుగా.!

NQ Staff - September 28, 2022 / 10:31 PM IST

YS Jagan : 175 విషయంలో వైఎస్ జగన్ అస్సలు తగ్గట్లేదుగా.!

YS Jagan : ‘ఎట్టి పరిస్థితుల్లోనూ 175కి 175 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాలి. గెలిస్తే గౌరవం పెరుగుతుంది, ఓడితే గౌరవం తగ్గుతుంది.. ఒక్క స్థానాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేం.. జుట్టు వుంటే, దాన్ని ఎలాగైనా ముడి వేసుకోగలం. అధికారం లేకపోతే ఏమీ చేయలేం..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులతో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలిప్పుడు వైసీపీ వర్గాల్లోనే కలకలం సృష్టిస్తున్నాయి. అధికారం లేకపోతే ఏమీ చేయలేమా.? అంటే, అధికారం కోల్పోతామన్న అనుమానం ఏమైనా వుందా.? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. గెలవడానికే కదా ఎవరమైనా పనిచేస్తాం.. అన్నది వైసీపీలో అంతర్గతంగా జరుగుతోన్న వాదన.

స్థానికంగా పరిస్థితులు మాకే తెలుసు..

వంద శాతం ఇళ్ళనూ కవర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడాన్ని వైసీపీలో ఎవరూ తప్పు పట్టలేరు. కానీ, అలా వెళుతున్న ఎమ్మెల్యేలకే స్థానిక పరిస్థితులేంటన్నవి బాగా తెలుసు. ‘అన్నీ చేస్తున్నాం.. ఆ లిస్టుతోనే జనంలోకి వెళుతున్నాం..’ అని జగన్ అంటున్నారు. ‘ఏమీ చేయడంలేదు..’ అంటూ జనం నిలదీస్తున్నారు.

‘అధినేత టార్గెట్లు పెడుతున్నారు.. సెక్యూరిటీ లేకుండా జనంలోకి వెళ్ళలేకపోతున్నాం.. సెక్యూరిటీ వున్నా, జనం నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నాం.. ముఖ్యమంత్రికున్న బారికేడ్ల సెక్యూరిటీ ఎమ్మెల్యేలకు వుండదు కదా..’ అంటూ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారుట.

కాగా, 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోవడం కాదు, 67 ఆ పైన పరిస్థితి దారుణంగా వుందన్నది వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోన్న వాదన.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us