Nellore: నెల్లూరులో దారుణం.. ప‌రాయి వ్య‌క్తికో వ్య‌భిచారం చేయ‌మంటూ దాడి

Nellore: రోజురోజుకి మ‌హిళ‌ల‌పై దాడులు పెరుగుతున్నాయి. దాడుల‌పై ఆందోళ‌న‌లు వ్యక్తం అవుతున్న‌ప్ప‌టికీ కీచ‌కులు మాత్రం ఏ మాత్రం వెన‌కాడ‌డం లేదు. ఏదో ఒక చోట మ‌హిళ‌లపై జ‌రుగుతున్నదాడులు వార్త‌ల‌లోకి ఎక్కుతూనే ఉన్నాయి. చిన్నారిపై హ‌త్యాచారం ఘ‌ట‌న మ‌ర‌చిపోక‌ముందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది.

In Nellore Man Attacked on girl Arrested
In Nellore Man Attacked on girl Arrested

మ‌రో వ్య‌క్తితో వ్య‌భిచారం చేయాలంటూ యువ‌తిని విచక్ష‌ణారాహిత్యంగా బాదాడు.దీనిని వీడియో కూడా తీయించాడు. చేతులతో , కర్రతో ఇష్టారాజ్యంగా ఆమెను కొట్టాడు. తన వల్ల కాదని యువ‌తిని బ్రతిమిలాడుతున్నా కనిపించకుండా దాదాపు కర్రతో పది దెబ్బలకు పైగా కొట్టాడు. ఒక చేత్తో ఆమెను కొడుతూ, దానిని వీడియో తీయించి మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. యువ‌తి చేతికి ఉన్న గాజులు గుచ్చుకొని ర‌క్తం కారుతున్నా కూడా ఆ యువ‌కుడు హృద‌యం క‌ర‌గ‌లేదు.

కర్రతో కొట్టకుండా అడ్డుకుంటే ఆమె ఒంటిపై బట్టలు చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు యువతి తన బట్టలు చించవద్దని ప్రాధేయపడింది. ఇక నేనేం చెప్పాను.. నువ్వేం చేసావు అంటూ యువతిపై ఇష్టారాజ్యంగా దాడి చేసిన వ్యక్తి వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువతి పై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇది మూడు నెల‌ల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌గా చెబుతున్నారు.

In Nellore Man Attacked on girl Arrested
In Nellore Man Attacked on girl Arrested

ప్ర‌స్తుతం అత‌న్ని నెల్లూరు పోలీస్ స్టేష‌న్‌లో ఉంచారు. రేపు కోర్టుకి హాజ‌రు ప‌ర్చ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇలాంటి దారుణాలు జ‌రుగుండ‌డంపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తమ వంతు బాధ్యతగా ఇలాంటి ఘటనలు ఎక్కడ తారసపడినా కచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేయాలి.