Hyper Aadi : ప్రజారాజ్యం గెలిచిన చోట హైపర్ ఆదీ పోటీ.. పవన్ డిసైడ్ చేశాడా..?
NQ Staff - January 21, 2023 / 10:34 AM IST

Hyper Aadi : ఈ నడుమ ఏపీ రాజకీయాల్లో సినీ సెలబ్రిటీల ప్రభావం బాగా పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఒక్కో పార్టీకి సపోర్టు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలోకి హైపర్ ఆది వచ్చి చేరాడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ తో ఫేమస్ అయిన ఆయన.. ఎన్నోసార్లు పవన్‌కు పెద్ద అభిమాని అని నిరూపించుకున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన రణస్థలం యువశక్తి వేదికపై మాట్లాడాడు.
జనసేన పార్టీకి మద్దతుగా పవన్‌కు సపోర్టుగా ఆయన చేసిన కామెంట్లతో ఒక్కసారిగా పవన్, జనసేన పార్టీ దృష్టిలో హీరో అయిపోయాడు. అయితే ఆయన ఇలా మాట్లాడటం వెనక వేరే కారణం ఉందని తెలుస్తోంది. హైపర్ ఆది త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడంట. ఈ విషయం ఇప్పటికే పవన్ దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీతో పొత్తు ఉన్నా లేకున్నా సరే ఆదికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఖాయం అని తెలుస్తోంది. ఆయనకు ఎక్కడ సీటు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయంపై ఇప్పటికే జనసేన అధినాయకత్వం ఆలోచిస్తోందంట. ఆయనకు సొంత జిల్లా ప్రకాశంలోనే సీటు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
కాపుల మద్దతుతో..
ముఖ్యంగా దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉందండోయ్. అదేంటంటే గిద్దలూరులో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు పోటీ చేసి విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు అక్కడే హైపర్ ఆదికి టికెట్ కేటాయిస్తే కాపుల మద్దతుతో గెలిచే అవకాశం ఉందని ఆలోస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.