Google: గూగుల‌మ్మ‌కే ప్ర‌శ్నార్ధ‌కంగా మారిన ఏపీ రాజ‌ధాని అంశం..!

Google: సాధార‌ణంగా మ‌నం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మ‌న‌కు తెలియ‌ని ఏ విష‌యం గురించి అయిన తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాం. అడ్రెస్, మ‌నిషి, ప్రాంతం ఇలా తెలియ‌ని విష‌యం గురించి గూగుల్‌లోనే వెతుకుతుంటాం. అయితే ఆ గూగుల‌మ్మకే తెలియ‌ని కొన్ని స‌మాధానాలు ఉంటియి. అందులో ఒక‌టి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం.

Google is Confused with AP Capital
Google is Confused with AP Capital

గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్ లో ఏపీ రాజ‌ధాని గురించి వెతికితే ఏకంగా నాలుగు సమాధానాలు చూపిస్తోంది. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్‌ అని నాలుగింటిని చూపిస్తోంది. అంతకుముందు గూగుల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని కొడితే అమరావతి పేరు చూపించేది. కానీ, మూడురాజధానులపై ప్రభుత్వ నిర్ణయంతో ఆ మూడింటి పేర్లు చూపిస్తోంది. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అని చట్టంలో పెట్టారు కాబట్టి హైదరాబాద్‌ను కూడా చూపించేస్తే గొడవ ఉండదేమో అనుకున్నట్లుంది.

వికీపీడియాలో ఏపీ రాజధాని ఏదంటే…దేశంలో మూడు రాజధానులున్న ఏకైక రాష్ట్రం అంటూ సమాధానం మొదలుపెడుతోంది. అక్కడ విశాఖ,అమరావతి, కర్నూలు అంటూ మూడు నగరాలను ఏపీ రాజధానిగా పేర్కొంటోంది. ఒక దేశానికి, రాష్ట్రానికి రాజధాని నగరంగా ఒకదాన్ని పేర్కొని చూపించాలంటే అక్కడ నిజంగా దానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. లేకుంటే నిర్మాణాలు చేస్తూ అయినా ఉండాలి.

ఎక్కడా రాజధాని నిర్మాణాలే జరగకుంగా, ఏ నిర్మాణాలూ చేయకుండా…ఏ కొత్తభవనాలూ లేకుండానే మూడు, నాలుగు రాజధానులు అని గూగులే చూపించేలా చేయడమంటే… అది ఒక్క జగన్‌కే చెల్లిందని కొందరు విమర్శిస్తున్నారు.