వైజాగ్ వాసులకి జగన్ సర్కార్ బంగారం లాంటి శుభవార్త !

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత జిల్లాకి అనేక హంగులు జోడించి పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. ఇందులోని భాగంగానే విశాఖ నుంచి భోగాపురం వరకు 50 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే అతి త్వరలో విశాఖ రోడ్ల పై ట్రామ్ రైళ్లను నడిపించే యోచన లో జగన్ సర్కారు ఉంది. ట్రామ్ రైలు ప్రాజెక్టు పేరిట విశాఖ పట్నంలోని ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి సరికొత్త రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది.

tram trains

కోలకతా వంటి మహానగరాల్లో ట్రామ్ రైళ్లను మనం చూడొచ్చు. ఈ రైళ్లకు ప్రత్యేకంగా రైలు పట్టాలు వేయాల్సిన అవసరం లేదు. డాంబర్ రోడ్డు మీదనే సెన్సార్ సిగ్నల్స్ తో ఈ రైళ్లు నడుస్తాయి. పరిపాలనా రాజధాని అయిన వైజాగ్ లో ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలని.. ట్రాఫిక్ సమస్యలు అసలు తలెత్తకూడదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాఖ నగరంతో పాటు భీమిలి ప్రాంతంలో కూడా రోడ్ల నిర్మాణాలకు నిధులను కేటాయించింది. విశాఖలో నివసిస్తున్న జనాభా సంఖ్య 23 లక్షల కు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఐతే పరిపాలనా రాజధానిగా వైజాగ్ అధికారికంగా ప్రకటించడం జరిగితే జనాభా సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆటోమేటిక్ గా ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన మరియు చౌకైన ట్రామ్ రైళ్లను విశాఖ రోడ్ల పై నడిపేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకునట్టు సమాచారం. భీమిలి వరకు ఈ ట్రైన్స్ నడుస్తాయని తెలుస్తోంది. మొత్తం మూడు కంపార్ట్మెంట్స్ ఉండే ఈ ట్రైన్లలో మూడు వందల మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ట్రామ్ రైళ్లు 23 లక్షల మంది ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో బాగా ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికైతే భీమిలి వరకు ట్రామ్ రైల్స్ వేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కానీ భవిష్యత్తులో భోగాపురం వరకు వీటిని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ట్రామ్ ట్రయిన్స్ విశాఖపట్నం రోడ్లపై నడిస్తే ఇక ప్రజలకు పండుగే పండుగ!

Advertisement