CM Jagan: జగన్ సర్కారు మరో మంచి నిర్ణయం

CM Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఏపీలో భూములున్న పుదుచ్చెరిలోని యానాం ప్రాంత రైతులకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం కింద డబ్బులు ఇవ్వనుంది. దీంతో 865 మందికి లబ్ధి చేకూరనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తమ పట్ల మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకోవటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరిలో భాగమైన యానం ఏరియా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వద్ద 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అక్కడ నివసించే 32 వేల మంది జనాభాలో ఎక్కువ శాతం మంది తెలుగు మాట్లాడతారు.

నిన్నే ఉత్తర్వుల జారీ..

యానాం ప్రజల్లో చాలా మందికి ఏపీలో పలు చోట్ల భూములున్నాయి. అందువల్ల వైఎస్సార్ రైతు భరోసా కోసం గతంలో అప్లై చేసినా ఆధార్ కార్డులో అడ్రస్ యానాం అని ఉండటంతో ఆ దరఖాస్తులను తిరస్కరించారు. స్థానికంగా నివసించట్లేదనే కారణంతో వాళ్లకు ఇన్నాళ్లూ ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. ఇలాంటివాళ్లు ఏకంగా 865 మంది వరకు ఉన్నారు. వీళ్లంతా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మూకుమ్మడిగా రిక్వెస్ట్ చేయటంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య ఎట్టకేలకు నిన్న బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక్కొక్కరికి రూ.7,500..

ఈ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా రూ.7,500లను రెండు విడతల్లో ఇస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా వచ్చే (మే) నెల 13న ఆంధ్ర ప్రదేశ్ రైతులతోపాటు యానాం రైతులకూ ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున వాళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తారు. యానాం ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన వాళ్లకు తాగునీళ్లు అందించారు. దీంతో వాళ్లు 18 అడుగుల ఎత్తైన రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటుచేశారు. ధవళేశ్వరం-యానాం మంచి నీటి ప్రాజెక్టులకు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి పేరుతో ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని యానాం ప్రజలకు వర్తింపజేయటం విశేషం.

Advertisement