Ganta Srinivas Rao : గంటా వర్సెస్ అవంతి.! ఎవరు ఎటువైపు.?
NQ Staff - November 26, 2022 / 12:51 PM IST

Ganta Srinivas Rao : మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు.. విశాఖ వేదికగా రాజకీయ ఆధిపత్య పోరు నడుపుతున్నారు గత కొంతకాలంగా.
2019 ఎన్నికల సమయంలో అవంతి శ్రీనివాస్ అనూహ్యంగా వైసీపీ వైపు తిరిగారు. ఆయన అంతకు ముందు టీడీపీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. నిజానికి, వైసీపీలోకి దూకెయ్యాలని గంటా తొలుత అనుకోగా, అవంతి అడ్వాన్స్ అయ్యారు. దాంతో, గంటా టీడీపీలోనే వుండిపోవాల్సి వచ్చింది.
జనసేన వైపు ఏ శ్రీనివాసరావు..?
గంటా ఇప్పటికీ వైసీపీతో టచ్‌లోనే వున్నారు. కానీ, గంటా ప్రయత్నాలకు అవంతి గండి కొడుతూ వచ్చారు. మంత్రి పదవి పోయాక అవంతి సీన్ కాస్త తగ్గింది వైసీపీలో. తాజాగా ఆయన్నుంచి పార్టీ బాధ్యతల్ని కూడా తీసేసింది వైసీపీ అధిష్టానం.
దాంతో, అవంతి తనకు అవమానం జరిగిందనే భావనలో వున్నారట.. ఆయన జనసేనతో టచ్‌లోకి వెళ్ళారనే ప్రచారం జరుగుతోంది. గంటా ఓ వైపు జనసేనతోనూ, ఇంకో వైపు వైసీపీతోనూ టచ్‌లో వున్నారు.
అవంతి గనుక జనసేన వైపు వెళితే, గంటా ఇంకో ఆలోచన లేకుండా వైసీపీలో చేరిపోతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అవంతికి జనసేనలో తలుపు తెరిచే వుంటాయా.? అన్నదే మిలియన్ డాలర్ల క్వశ్చన్.