Gangavva : ఆ ఛానెళ్ వాళ్లు చెబితేనే చంద్రబాబును తిట్టాను.. గంగవ్వ క్షమాపణలు..!

NQ Staff - May 24, 2023 / 09:15 AM IST

Gangavva : ఆ ఛానెళ్ వాళ్లు చెబితేనే చంద్రబాబును తిట్టాను.. గంగవ్వ క్షమాపణలు..!

Gangavva : మై విలేష్ షో గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అరవై ఏండ్ల వయసులో కూలీ పని చేసుకునే గంగవ్వ యూట్యూబ్ స్టార్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి చాలామందికి చేరువయింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు టీవీల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది.

అయితే తాజాగా గంగవ్వ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నన్ను క్షమించండి. నాకు జ్ఞానం లేదు. చదువు రాదు. నాకు పెద్దగా తెలియదు. ఆ ఛానెళ్ వాళ్లు చెబితేనే నేను చంద్రబాబును తిట్టాను. అంతే గానీ నాకు ఏ ఉద్దేశం లేదు. నాది తప్పు అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబును తిట్టినట్టు తెలుస్తోంది. కాగా ఆమె ఇలా క్షమాపణలు చెప్పడం టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఎవరైనా చెబితే తిట్టేస్తావా.. ఆ మాత్రం కూడా తెలియదా అంటూ కడిగేస్తున్నారు.

ఈ వీడియోపై మరికొందరు మాత్రం పెద్దావిడ తెలియక తప్పు చేసింది వదిలేయండి అంటూ చెబుతున్నారు. మరి ఈ ఘటనపై టీడీపీ నేతలు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us