Anandayya: ఆనందయ్య మందుకు సంబంధించిన పూర్తి వివరాలు

Anandayya: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొణిగె ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగులో ఉన్న టాపిక్. అయితే ఆ మెడిసిన్ ని ఎలా తయారుచేస్తారు? ఎలా వాడతారు? అందులో ఏయే మూలికల(దినుసుల)ని ఎంత మోతాదులో వేస్తారు? అనే వివరాలు ఎక్కడా పెద్దగా దొరకట్లేదు. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న ఒక ఫైల్ లో డిటెయిల్స్ ఇలా ఉన్నాయి..

Anandayya Ayurvedic Medicine

  1. మందు పేరు ‘పి’ (కొవిడ్ ఉన్నోళ్లకి, లేనోళ్లకి): తెల్ల జిల్లేడు-100 గ్రాములు; మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, డావరడంగి(బుడ బుడసాకు)-200 గ్రాముల చొప్పున; అల్లం-50 గ్రాములు; నల్ల జీలకర్ర, పట్టా (దాల్చిన చెక్క), పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క-35 గ్రాముల చొప్పున; తాటి బెల్లం, తేనె తగినంత వేయాలి.
  2. మందు పేరు ‘ఎఫ్’ (కొవిడ్ ఉన్నోళ్లకి): ఉప్పింటాకు-కేజీ; అల్లం-50 గ్రాములు; నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, మిరియాలు, పిప్పళ్లు, జాజికాయ, పచ్చ కర్పూరం-35 గ్రాముల చొప్పున. తాటి బెల్లం, తేనె తగినంత వేయాలి.
  3. మందు పేరు ‘ఎల్’ (కొవిడ్ ఉన్నోళ్లకి): నేల ఉసిరిక-అర కేజీ; గుంట గలగర-అర కేజీ; అల్లం-50 గ్రాములు; నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, మిరియాలు, పిప్పళ్లు, జాజికాయ, పచ్చ కర్పూరం-35 గ్రాముల చొప్పున. తాటి బెల్లం, తేనె తగినంత వేయాలి.
  4. మందు పేరు ‘కె’ (కొవిడ్ ఉన్నోళ్లకి): పెద్ద పల్లేరు కాయలు-కేజీ; అల్లం-50 గ్రాములు; నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, మిరియాలు, పిప్పళ్లు, జాజికాయ, పచ్చ కర్పూరం-35 గ్రాముల చొప్పున. తాటి బెల్లం, తేనె తగినంత వేయాలి.

Anandayya Ayurvedic Medicine

5. కంట్లో వేసే చుక్కల మందు: తేనె-కేజీ; తోక మిరియాలు-100 గ్రాములు; ముల్ల వంకాయలు-చారెడు; నేల ములక, నేల వాగుడు (నేల వాగుడు పళ్లని బాగా దంచి గుడ్డలో పిండగా వచ్చిన జ్యూస్ వాడాలి). ఈ మూలికలని బాగా దంచి, రసం తీసి పెట్టుకొని, పిప్పిని మైనం లాగా నూరుకొని, ఒక పాత్రలో ఈ మూలికా రసాన్ని, తాటి బెల్లాన్ని కలిపి ఉడికించి, మట్టి వాసన వచ్చినప్పుడు దించి, తేనె కలిపి వాడుకోవాలి.

6. మందులను వాడే పద్ధతి: ‘పి’ అనే మందును కుంకుడు గింజంత సైజులో ఉదయం, సాయంత్రం మూడు రోజులు. ‘ఎఫ్’ అనే మందును మధ్యాహ్న భోజనం తర్వాత కుంకుడు కాయంత సైజులో రోజుకి ఒకసారి రెండు రోజులు. ‘ఎల్’ అనే మందుని సాయంత్రం 5 గంటలకు కుంకుడు గింజంత సైజులో రోజుకి ఒకసారి రెండు రోజులు వాడాలి. ‘కె’ అనే మందుని పై మందులకు గ్యాప్ ఇచ్చి రోజుకి ఒకసారి రెండు రోజులు వాడాలి. కొవిడ్ లేనోళ్లు ‘పి’ అనే మందుని ఒక్కసారి వాడితే సరిపోతుంది. పాజిటివ్ వచ్చినోళ్లు ‘పీ’ అనే మందుని మూడు రోజులు, ఎఫ్, ఎల్, కే అనే మందులను రెండు రోజులు వాడాలి.

Anandayya Ayurvedic Medicine

 

మరిన్ని వివరాలకు ఆనందయ్య ఫోన్ నంబర్ 6281025921. ఈ సమాచారాన్ని సేకరించిన డీవీఎస్ రాజు ఫోన్ నంబర్ 9885593388. ఈ కంటెంట్ ని ఎడిటింగ్ చేసిన బాలకృష్ణ ఫోన్ నంబర్ 9989327336.