YS Jagan Mohan Reddy : వైఎస్ జగన్ అనే నేను.. ప్రజా ప్రభుత్వానికి నేటితో నాలుగేళ్లు..!

NQ Staff - May 30, 2023 / 09:43 AM IST

YS Jagan Mohan Reddy  : వైఎస్ జగన్ అనే నేను.. ప్రజా ప్రభుత్వానికి నేటితో నాలుగేళ్లు..!

YS Jagan Mohan Reddy  : సరిగ్గా నాలుగేండ్ల క్రితం ఇదే రోజున ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని అఖండమైన మెజార్టీని సాధించిన ఏకైక పార్టీ వైసీపీ. పైగా జగన్ అధికారంలోకి వచ్చిన మొదటిసారికే ఇంత స్థాయిలో మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదనే చెప్పుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయన ఇలా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ జనాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. 151 ఎమ్మెల్యే సీట్లు గత ఎన్నికల్లో జగన్ గెలుచుకున్నారు.

ఇప్పటికిప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించినా సరే అంతకు మించి సీట్లు వస్తాయని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు జగన్ మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందనేది. కాగా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేండ్లు కావస్తున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు వైసీపీ నేతలు.

Four Years Ago On This Day YS Jagan Mohan Reddy Took oath As Chief Minister of AP

Four Years Ago On This Day YS Jagan Mohan Reddy Took oath As Chief Minister of AP

రీసెంట్ గానే అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ చేసి ఎక్కడా ఎలాంటి నెగెటివిటీకి తావు లేకుండా చేసుకుంటున్నారు జగన్. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఇంత కంటే భారీ మెజార్టీతో మరోసారి సీఎం పీఠం అధిష్టంచడం ఖాయం అని చెబుతున్నారు వైసీపీ పార్టీ శ్రేణులు.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us