Kodali Nani : అర్థరాత్రి అపోలో లో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని

NQ Staff - November 19, 2022 / 02:32 PM IST

Kodali Nani : అర్థరాత్రి అపోలో లో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani : వైకాపా ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో అర్ధరాత్రి జాయిన్ అయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో తీవ్రమైన కడుపు నొప్పి మరియు వెన్నునొప్పి రావడంతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు.

కొడాలి నాని నిన్న రాత్రి సమయంలో విపరీతమైన నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండు లేదా మూడు రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో కొడాలి నాని చికిత్స జరగబోతున్నట్లుగా వైద్యుల ద్వారా సమాచారం అందుతుంది.

ఒక చిన్న శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో రాళ్లను తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. గత కొన్నాళ్లుగా వేడి వేడి మాటలతో మీడియాలో ఉంటున్న కొడాలి నాని ఇప్పుడు ఆరోగ్యం బాలేక పోవడంతో వార్తలు నిలిచాడు.

త్వరలోనే మళ్లీ మునుపటి ఉత్సాహంతో కొడాలి నాని రంగంలోకి దిగి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులపై నిప్పులు జరుగుతాడని వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొడాలి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని పార్టీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తూ కోరుకుంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొడాలి నాని యొక్క ఆరోగ్య పరిస్థితి విషయమై ఎంక్వౌయిరీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us