Pawan Kalyan : జనసేనానితో సినీ ప్రముఖుల భేటీ.! సినీ పరిశ్రమ మొత్తం జనసేనకు మద్దతిస్తుందా.?

NQ Staff - November 17, 2022 / 08:58 PM IST

Pawan Kalyan : జనసేనానితో సినీ ప్రముఖుల భేటీ.! సినీ పరిశ్రమ మొత్తం జనసేనకు మద్దతిస్తుందా.?

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సినీ ప్రముఖులు త్వరలో భేటీ కాబోతున్నారట. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అలాగే, సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో భేటీ విషయమై ఓ అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది.

పరిశ్రమకు సంబంధించిన కొందరు ప్రముఖులు లీడ్ తీసుకుని, జనసేనానితో భేటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

జనసేనానితో భేటీ కోసం ఇంత హంగామా ఎందుకు.?

కొన్నాళ్ళ క్రితం, సినీ పరిశ్రమ వేరు, పవన్ కళ్యాణ్ వేరు.. అనే స్థాయికి ఓ సినీ నటుడు ‘మా’ ఎన్నికల సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆయన ఇప్పుడు పరిశ్రమలో ఓ విభాగానికి కీలక పదవిలో వున్నాడు కూడా.

మరి, పవన్ కళ్యాణ్‌తో పరిశ్రమ పెద్దల భేటీ, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి సీని పరిశ్రమ తరఫున మద్దతివ్వాలనే ఆలోచన.. ఇవన్నీ ఎలా జరుగుతున్నట్లు.? ఏపీకి సంబంధించి మాత్రమే ఈ మద్దతు సినీ పరిశ్రమ నుంచి వుంటుందా.? తెలంగాణలోనూ ఆ మద్దతు కొనసాగుతుందా.?

అయితే, ఈ ప్రచారాన్ని సినీ పరిశ్రమలో కొందరు ఆక్షేపిస్తున్నారు. పరిశ్రమ ఒక్కతాటిపైనే వుంటుందనీ.. అది పరిశ్రమకు సంబంధించిన అంశాల విషయంలోనే జరుగుతుందనీ, రాజకీయాల విషయానికొస్తే ఎవరిష్టం వాళ్ళదేననేది వారి వాదన.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us