Exit Polls : తిరుపతి, నాగార్జునసాగర్లలో గెలిచేది వీళ్లే.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయ్..

Exit Polls: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఏపీలో తిరుపతి లోక్ సభ, తెలంగాణలో నాగార్జునసాగర్ శాసన సభ బైఎలక్షన్లలో గెలవబోయే పార్టీలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ రోజు గురువారం రాత్రి వెల్లడైన ఈ సర్వేల ప్రకారం పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ మధ్య విజయావకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ పర్సంటేజ్ లో ఉన్నాయని దాదాపు నాలుగు సంస్థలు అంచనా వేస్తున్నాయి. అస్సాంలో బీజేపీ గెలవబోతోందని ఇండియా టుడే తేల్చిచెప్పింది. కేరళలో ఎల్డీఎఫ్ నెగ్గనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే జోస్యం చెప్పాయి. పుదుచ్చెరిలో కమల నాథులు విక్టరీ కొట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక తమిళనాడులో డీఎంకే ఘన విజయం సాధించబోతోందని రిపబ్లిక్ సంస్థ తన స్టడీలో పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి సక్సెస్ కొట్టబోతున్నారని ఆరా అనే సంస్థ వెల్లడించింది. జగన్ పార్టీ 65.85 శాతం ఓట్లతో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోనున్నట్లు తెలిపింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి కేవలం 23.10 శాతం ఓట్లే వస్తున్నాయి. బీజేపీ సింగిల్ డిజిట్ పర్సంటేజీకి పరిమితం కాబోతోంది. ఇతరులు అంటే కాంగ్రెస్ ప్లస్ అదర్స్ మరీ ఘోరంగా 5 శాతం లోపు ఓట్లతో బతుకు జీవుడా అనాల్సి రానుంది.

నాగార్జునసాగర్ లో..

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ బైఎలక్షన్ లో రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ క్యాండేట్ నోముల భగత్ కుమార్ విజయాన్ని కైవసం చేసుకోనున్నారు. తన తండ్రి నోముల నర్సింహయ్యకి రాజకీయ వారసుడిగా ప్రజా సేవలో నిమగ్నం కానున్నాడు. గులాబీ పార్టీ 50 శాతం ఓట్లను కైవసం చేసుకోనున్నట్లు ఆరా సంస్థ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇస్తోంది. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ సింగిల్ డిజిట్ పర్సంటేజీ ఓట్లకే పరిమితం కానుంది. ఆత్మసాక్షి అనే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లోనూ ఇదే ఫలితం వచ్చింది.

Advertisement