Sabbam Hari: సబ్బం హరికి సీరియస్

Kondala Rao - April 25, 2021 / 09:48 PM IST

Sabbam Hari: సబ్బం హరికి సీరియస్

Sabbam Hari మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తనకు కొవిడ్-19 వైరస్ సోకినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు పది రోజుల కిందట (ఈ నెల 15న) పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సబ్బం హరి మొదటి మూడు రోజులు హోం క్వారంటైన్ లో ఉండి, అనంతరం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

1 25

ఇదీ నేపథ్యం..

2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో సబ్బం హరి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. అదే ఎలక్షన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా గెలిచారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అంతకుముందు సబ్బం హరి వైజాగ్ సిటీ మేయర్ గా కూడా చేశారు. తగరపువలస సమీపంలోని చిట్టివలస ఊరిలో పుట్టిన సబ్బం హరికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. డిగ్రీ చదువుతుండగానే ఫైనల్ ఇయర్ లోనే బియ్యం వ్యాపారం ప్రారంభించారు. తర్వాత లారీలు కొన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు. ఏదీ కలిసి రాకపోవటంతో పాలిటిక్స్ లోకి వచ్చారు.

జగన్ కి వ్యతిరేకిగా..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక సబ్బం హరి వైఎస్ జగన్ కి సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడూ మద్దతుగా నిలవటంతో జగన్ ఫ్యాన్స్ చాలా మంది ఆయన్ని అభిమానించారు. అప్పట్లో జగన్ కి అనుకూలంగా మాట్లాడిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల్లో ఈయన ఒకరు. మరో ఎంపీ ఉండవల్లి. తర్వాత ఏమైందో ఏమో సబ్బం హరి వైఎస్ జగన్ కి బద్ధ వ్యతిరేకిగా మారారు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్నాక ఎవరి అభిప్రాయాలకీ గౌరవం ఇవ్వట్లేదనే ఉద్దేశంతోనో ఏమో దూరమైనట్లు గుర్తు. అప్పటి నుంచి మొదలైన గ్యాప్ ఇంతవరకూ పూడనేలేదు. ఏది ఏమైనా సబ్బం హరి కరోనా నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తూ..

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us