Raghuveera Reddy : వీడియో : మొన్న రైతుగా, నేడు మనవరాలితో రఘువీర డాన్స్‌

NQ Staff - November 9, 2022 / 12:42 PM IST

Raghuveera Reddy : వీడియో : మొన్న రైతుగా, నేడు మనవరాలితో రఘువీర డాన్స్‌

Raghuveera Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో కీలక మంత్రిగా వ్యవహరించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

కొన్నాళ్ల క్రితం రఘువీరా రెడ్డి ఒక సాధారణమైన రైతు మాదిరిగా టీవీఎస్ ఎక్సెల్ బండి పై ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మంత్రిగా వందల కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్న వారు ఉన్నారు.

కానీ మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన రఘువీరా రెడ్డి ఇప్పుడు ఒక సాధారణమైన రైతుగా జీవితాన్ని గడపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

తాజాగా మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తన మనమరాలతో కలిసి రఘువీరా రెడ్డి డాన్స్ చేస్తున్నారు. ఒక పాప్ సాంగ్ కి లైట్ స్టెప్స్ తో ఆయన మనవరాలు తో కలిసి వేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో లో రఘువీరారెడ్డి చాలా సన్నబడ్డట్లుగా కనిపిస్తున్నాడు అంటూ ఆయన మద్దతుదారులు మరియు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు రఘువీరా రెడ్డి లాంటి నాయకులు ముందుండి పార్టీని నడిపించాలని కొందరు పార్టీ కార్యకర్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us