Ex Minister Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి ‘లోన్’ బెదిరింపులు.!

NQ Staff - July 29, 2022 / 07:40 PM IST

Ex Minister Anil Kumar Yadav  : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి ‘లోన్’ బెదిరింపులు.!

Ex Minister Anil Kumar Yadav  : ఎడా పెడా లోన్లు ఇచ్చేస్తోన్న బ్యాంకులు, లోన్ యాప్‌లు.. ఆ తర్వాత ఎలా బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన బావ.. అని చెప్పి ఓ వ్యక్తి ఓ బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడట.

తీసుకున్న లోన్ ఆ వ్యక్తి చెల్లించకపోవడంతో, బ్యాంకు సిబ్బంది పేరుతో కొందరు అనిల్ కుమార్ యాదవ్‌కి ఫోన్ చేశారు. అయితే, తనకు అశోక్ కుమార్ పేరుతో బావ ఎవరూ లేరని మాజీ మంత్రి అనిల్ స్పష్టం చేశారు. అయినా, తగ్గని బ్యాంకు సిబ్బంది.. ‘మీరు కట్టకపోతే డబ్బులు ఎవరు కడతారు.? ఆ అశోక్ కుమార్‌తో మీరే మాట్లాడి తేల్చుకోండి.. మీ నంబర్ ఇచ్చారు కాబట్టే, మీతో మాట్లాడుతున్నాం..’ అంటూ మరింతగా స్వరం పెంచారు.

అనిల్ దూషణలకు దిగినాగానీ..

Ex Minister Anil Kumar Yadav Audio Leak With Bank Recovery Agent

Ex Minister Anil Kumar Yadav Audio Leak With Bank Recovery Agent

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటి దురుసు సంగతి తెలిసిందే కదా.? ఆయన కాస్త గట్టిగానే, ఒకింత దూషణ రీతిలోనే విరుచుకుపడ్డారు సదరు బ్యాంకు సిబ్బందితో. కానీ, అట్నుంచి అస్సలు తగ్గలేదు. బ్యాంకు అడ్రస్ చెప్పాలనీ, తన మనుషులు వచ్చి మాట్లాడతారని మాజీ మంత్రి అనిల్ చెబితే, ‘వచ్చి డబ్బులు కడతారా.?’ అని అట్నుంచి ఆ మహిళ నిలదీయడం గమనార్హం.

ఈ మొత్తం వ్యవహారాన్ని అనిల్ కుమార్ యాదవ్, ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ కాల్ రికార్డ్ మీడియాకి విడుదల చేశారు అనిల్ కుమార్ యాదవ్. కాగా, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కూడా ఈ తలనొప్పి తప్పలేదు. పోలీసులకు విషయాన్ని మంత్రి కాకాణి చేరవేయగా, రంగంలోకి దిగిన పోలీసులు నలుగుర్ని చెన్నయ్‌లో అరెస్ట్ చేశారు. వారిని విడిపించేందుకు 10 మంది ప్రముఖ న్యాయవాదులు రంగంలోకి దిగారట.
మంత్రి, మాజీ మంత్రి పరిస్థితే ఇలా వుంటే, సామాన్యుల పరిస్థితేంటి.? పోలీసులు మాత్రం, లోన్ వేధింపులకు ఎవరైనా పాల్పడితే ఫిర్యాదు చేయాలని అంటున్నారు.

 

 

Read Today's Latest వీడియోస్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us