పార్టీలోని ఆ ముగ్గురినీ కంట్రోల్ చేయకపోతే టీడీపీ భూస్థాపితమే

Surya - November 13, 2020 / 05:30 PM IST

పార్టీలోని ఆ ముగ్గురినీ కంట్రోల్ చేయకపోతే టీడీపీ భూస్థాపితమే

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ నేతలే. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన ఆడారు. మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అన్నంత ఆత్రంగా చేతులు తడిపేసుకున్నారు. అది, ఇది తేడా లేకుండా స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ దున్నిపారేశారు. ఈ పద్దతే జనానికి నచ్చలేదు. ఇంకెంత తింటారు.. ఇంటికి వెళ్ళండి అన్నట్టు ఓడగొట్టి పక్కన పెట్టారు. జగన్ సరిగ్గా దృష్టిపెడితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడ కోల్పోతుంది టీడీపీ. ఇంతటి దుస్థితిలో ఉన్నా ఆ పార్టీ నాయకులు కొందరు మారలేదు. పాత పద్ధతిలోనే వెళుతూ ఇంకాస్త నష్టం చేకూరుస్తున్నారు.

East Godavari TDP facing troubles with those three leaers

East Godavari TDP facing troubles with those three leaers

ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి ముగ్గురు లీడర్ల మూలంగా సైలెంట్ డ్యామేజ్ జరిగిపోతోంది. గతంలో జనం మీద పది పిండుకున్న అక్కడి నేతలు కొందరు ఇప్పుడు సొంత పార్టీ మీదే పడిపోతున్నారట. తునిలో ఒక సీనియర్ నేత పార్టీ ఎదుగుదలను పక్కనబెట్టి సొంత లాభం చూసుకుంటున్నారట. ఈ సంగతిని ఎప్పుడో గమనించిన అక్కడి ప్రజలు గత మూడు దఫాలుగా ఆయన్ను ఓడగొడుతూ వస్తున్నారు. అయినా ఆయన మారలేదట. సీనియర్ అనే పేరుతో పార్టీని, వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారట.

అదే జిల్లాకు చెందిన మరొక సీనియర్ లీడర్ సైతం ఇదే ధోరణిలో ఉన్నారట. గత రెండు దఫాలుగా గెలుస్తూ వచ్చిన ఆయన పదవి చూసుకుని చెలరేగిపోతున్నారట. సొంత నియోజకవర్గాన్ని వదిలేసి తనకు ఎలాంటి సంబంధంలేని పక్క నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూస్తున్నారట. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన వేలు పెడుతున్నారట. దీంతో అక్కడి టీడీపీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారని, వీలైతే పార్టీని వీడి పోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

వీరిద్దరిదీ ఒక ఎత్తైతే ఇంకొక పాత లీడర్ దొరికినంత దాచుకో అన్నట్టు ఉన్నారట. ఆయన ప్రజలు ఎన్నుకున్న పదవిలో లేకపోయినా పెద్దల పదవిలో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండగా అడ్డూ ఆపు లేకుండా లబ్ది పొందిన ఈయన ఇప్పుడు కూడ అదే ధోరణిలో ఉన్నారట. వీరి ముగ్గురి తీరుతో జిల్లా కేడర్ విసుగెత్తిపోతోందట. బాధ్యత తీసుకుని నిలబెట్టాల్సిన సీనియర్ నేతలే ఇలా చేస్తే ఇక పార్టీ బ్రతికి బట్టకట్టేదెలా, ఇప్పటికైనా చంద్రబాబు కలుగజేసుకుని వీరిని అదుపులో పెడితే బాగుంటుందని అంటున్నారట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us