Dwarampudi Chandrasekhar : అంత డబ్బు ఉండి ఉంటే నిన్ను కొనేసేవాడిని
NQ Staff - June 19, 2023 / 08:22 PM IST

Dwarampudi Chandrasekhar : వారాహి యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ద్వారంపూడి.. ఆయన తండ్రి మరియు సోదరుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
కేవలం బియ్యం ద్వారా మాత్రమే ద్వారంపూడి రూ.15 వేల కోట్లు దోపిడీ చేశారంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలపై ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. తాను నిజంగా 15 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే ఏం చేసేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
కాకినాడ జోన్ మొత్తం బియ్యం ఎగుమతి విలువే రూ.15 వేల కోట్లు ఉండదని.. అలాంటిది నాపై అలాంటి ఆరోపణలు ఎలా చేస్తున్నారంటూ ద్వారంపూడి ప్రశ్నించాడు. ఒక వేళ తన వద్ద అంత డబ్బే ఉంటే చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ ఏదో నేనే ఇచ్చేవాడిని కదా అంటూ పేర్కొన్నాడు.
పవన్ కళ్యాణ్ కు కావాల్సింది ప్యాకేజీ మరియు రెండు సీట్లు. నా వద్ద ఉన్న డబ్బుతో పవన్ కళ్యాణ్ ను కొనేవాడిని అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నోటికి వచ్చింది మాట్లాడొద్దు అంటూ ద్వారంపూడి హెచ్చరించాడు.