MP Avinash Reddy : వివేక హత్య కేసు : సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
NQ Staff - January 24, 2023 / 09:29 AM IST

MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న కడప జిల్లాలో పలు చోట్ల విచారణ జరిపారు. ఆ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిద్ధం అయ్యారు. కానీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.
సీబీఐ అధికారుల యొక్క విచారణ కు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారులకు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాసి తాను విచారణకు హాజరు కాకపోవడం పట్ల వివరణ ఇచ్చారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో దర్యాప్తునకు పూర్తి స్థాయిలో నా సహకారాన్ని అందిస్తాను. విచారణ కోసం ఒక్క రోజు ముందు నోటీసులు పంపించారు. అంతకు ముందు అనేక కార్యక్రమాలు అరేంజ్ అవ్వడం వల్ల విచారణకు హాజరు కాలేక పోయాను అన్నాడు.
5 రోజుల తర్వాత మీరు ఎప్పుడు పిలిచాన కూడా విచారణకు హాజరు అవుతాను అన్నట్లుగా ఎంపీ సీబీఐ అధికారులకు తన లేఖలో పేర్కొన్నాడు. ఈ కేసులో అవినాష్ రెడ్డి పై అనుమానం ఉన్నట్లుగా వివేకా కూతురు సునీత రెడ్డి పేర్కొనడంతో ఆయన్ను సీబీఐ అధికారులు విచారించబోతున్నారు.