CM YS Jagan : ఇదీ.. సీఎం వైఎస్ జగన్ ‘‘ప్రత్యేక’’త..

CM YS Jagan : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల నోళ్లు మాయించేలా మంచి పని చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెపారు. జగన్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ అంశాన్ని మర్చిపోయాడనే అపవాదును ఆయన క్రమంగా చెరిపేసుకుంటున్నాడు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం తదితర అపొజిషన్ పార్టీలు మళ్లీ ఆ విమర్శ చేసే ఛాన్స్ లేకుండా చేశారు. నిన్న శనివారం వర్చువల్ విధానంలో జరిగిన 6వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రస్తావించి వార్తల్లో నిలిచారు. తద్వారా ఏపీ ప్రజల మనసును మరోసారి గెలుచుకున్నారు.

నష్టపోయాం..

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీయటంతో ఏపీ ఎన్నో విధాలుగా నష్టపోయింది. అందువల్ల రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. ఆ హోదా వస్తేనే మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థికంగా పుంజుకోవటం, పారిశ్రామికంగా పురోగతి వంటివి సాధ్యమవుతాయి. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. ప్రముఖంగా, గొప్పగా ప్రకటించింది. కానీ ఏడేళ్లు కావస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా అంశం గురించి ఇప్పటివరకు ఒకటీ రెండు సార్లు మాత్రమే మాట్లాడి ఉంటారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

 CM YS Jagan : that is cm ys jagan ‘special’ity
CM YS Jagan : that is cm ys jagan ‘special’ity

బ్యాడ్ లక్: CM YS Jagan

వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి బహిరంగ సభలోనూ, సమావేశంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా గురించే ముఖ్యంగా మాట్లాడేవారు. 2019 జనరల్ ఎలక్షన్స్ ఫలితాలు వెలువడ్డ రోజు(వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన రోజు) కూడా దానిపైన విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించారు. అయితే అప్పటివరకూ మాట్లాడిన మాటకు ఆ రోజు మాట్లాడిన మాటకు చాలా తేడా కనిపించింది. అంతకుముందు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చి తీరాల్సిందేనన్న జగన్ ఆ రోజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీయటం వల్ల పార్లమెంటులో ఆ పార్టీకి బ్రహ్యాండమైన మెజారిటీ వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా డిమాండ్ చేసినా వాళ్లు పట్టించుకోకపోవచ్చని, ఇది మన బ్యాడ్ లక్ అని అన్నారు. పార్లమెంటులో బీజేపీకి వైఎస్సార్సీపీ మద్దతు అవసరంపడితే అప్పుడు గట్టిగా అడిగే వీలుండేది గానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని ఉన్నది ఉన్నట్లు చెప్పారు. అయినా ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం మా వంతు ప్రయత్నాలు మేం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు ఆ డిమాండును తెర మీదికి తెచ్చారు. మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి లాంటివాళ్లు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తెస్తున్నామని పదే పదే చెబుతున్నా సీఎం వైఎస్ జగన్ గట్టిగా, ఓపెన్ గా అడగటం ఇదే తొలిసారి.

Advertisement