YS Jagan Mohan Reddy : మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే ఎజెండా లేదు : వైఎస్‌ జగన్‌

NQ Staff - November 12, 2022 / 03:10 PM IST

YS Jagan Mohan Reddy : మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే ఎజెండా లేదు : వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సాగుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వైకాపా శ్రేణులు ప్రధాని రాక నేపథ్యంలో సొంత పార్టీ కార్యక్రమం అన్నట్లుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు కొన్ని విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ నేపద్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మేము అనేక మార్లు పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖపట్నం యొక్క ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపై మీకు విజ్ఞప్తులను అందజేయడం జరిగింది.

ఆ అంశాలపై సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంటూ ప్రధాని సమక్షంలో జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశాడు. అంతే కాకుండా మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని సీఎం అన్నారను.

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే అజెండా లేకుండా తాము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నట్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ని మచ్చిక చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానం అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశాడు అంటూ రాజకీయ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us