CM YS Jagan-Modi : ఫ్లాష్.. ఫ్లాష్ : జగన్ ప్రభుత్వానికి మోడీ సర్కారు ప్రశంసలు

CM YS Jagan-Modi : ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కాగ. వాటిలో ఏపీ బీజేపీ కూడా ఉండొచ్చు గాక. వాటన్నింటినీ పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఏపీలో ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మోడీ సర్కారు మెచ్చుకుంది. ప్రతి పల్లెకు, ప్రతి పర్సన్ కి, ప్రతి సంస్థకి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు వైఎస్సార్సీపీ గవర్నమెంట్ తలపెట్టిన ‘‘భారత్ నెట్’’ ప్రాజెక్టు బ్రహ్మోండం అంటూ ‘నీతి ఆయోగ్’ సంస్థ కితాబిచ్చింది.

ట్వీట్-రీట్వీట్..

ఈ మేరకు సీఎం జగన్ ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్టింగును నీతి ఆయోగ్ ఈరోజు (శనివారం) రీట్వీట్ చేయటం గమనార్హం. భారత్ నెట్ పేరుతో ప్రతి విలేజ్ లోనూ డిజిటల్ పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొనగా ఆ ఆలోచనను కేంద్రం అభినందించింది. ఈ ప్రాజెక్టు వల్ల వర్క్ ఫ్రం హోం అనే కాన్సెప్టును గ్రామ స్థాయి నుంచి అమలుచేయొచ్చని జగన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతరాయంలేని, నాణ్యత కలిగిన అంతర్జాల సేవలను అందిస్తే ఊళ్లు కూడా సిటీలు, టౌన్ల స్థాయిలో డెవలప్ అవుతాయని సీఎం జగన్ ఆకాంక్షించారు.

CM YS Jagan-Modi : modi-governament-acclaimed-ys-jagan-sarkar
CM YS Jagan-Modi : modi-governament-acclaimed-ys-jagan-sarkar

అరచేతిలో: CM YS Jagan-Modi

గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. చదువుతో సంబంధం లేకుండా దాదాపు అందరూ పెద్ద ఫోన్లు, మొబైల్ డేటా వాడుతున్నారు. తద్వారా సమాచారం క్షణాల్లో పాకిపోతోంది. వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన స్థాయి పెరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, విధానాలు జనానికి ఈజీగా చేరుతున్నాయి. ఫలితంగా ప్రపంచమే మన అరచేతిలోకి వచ్చినట్లు పబ్లిక్ భావిస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ త్వరలో ప్రారంభించబోతున్న ఈ భారత్ నెట్ ప్రాజెక్టు మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిజిటల్ ఇండియా లక్ష్యాలను నెరవేర్చటానికి ఇతోధికంగా తోడ్పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జగన్ పథకాన్ని స్వాగతించింది.

 

Advertisement