CM YS Jagan : సీఎం వైఎస్ జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా?..

CM YS Jagan : ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి ప్రభుత్వపరంగా ప్రత్యేక ఆదాయం ఉండదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతోపాటు ఆయనకీ నెలవారీ వేతన భత్యాలు గట్రా ఇస్తారు. కాకపోతే సీఎం కాబట్టి వాళ్ల కన్నా కొంచెం ఎక్కువ శాలరీ, అలవెన్సులు వస్తాయి. అంతే తప్ప ఆయనకి ఒక్క రోజు ఆదాయం అంటూ స్పెషల్ గా ఏదీ ఉండదు. పర్సనల్ గా ఏమైనా ఉంటే ఉండొచ్చు. సర్కారు నుంచి మాత్రం అలా ఇన్ కం రాదు. సహజంగా ఈ లెక్కలు ఎవరూ వేయరు కూడా. కానీ.. కాంగ్రెస్-కమ్-తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఒక చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)లా మారిపోయి సీఎం జగన్ కి ఒక్క రోజు ఆదాయం రూ.300 కోట్లు అని తేల్చేశాడు. పైగా ఇది నిజమో కాదో తెలియదంటూ ట్విస్ట్ ఇచ్చాడు. జనం ఇలా అనుకుంటున్నారంటూ వాళ్ల మాటగా చెప్పాడు.

నువ్వెందుకు?..

లోకులు పలు కాకులు. ఈ సామెత జేసీకి తెలియంది కాదు. ప్రజలు ఎవరి గురించైనా, ఏదైనా, ఎన్నైనా అనుకుంటారు. అది వాళ్లిష్టం. వాళ్లు దివాకర్ రెడ్డి మాదిరిగా దిమాక్ లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి టాం టాం చేయట్లేదు కదా అని వైఎస్సార్సీపీ అభిమానులు అడుగుతున్నారు. నీ స్టేట్మెంట్ మీద నిలబడే దమ్మూధైర్యమే నీకు లేనప్పుడు, దాన్ని పబ్లిక్ మీదికి నెట్టేయాలని అనుకున్నప్పుడు ఇక నీ మాటకు ఏం విలువ ఉంటుంది? అని వాళ్లు నిలదీస్తున్నారు. ఈ రోజు(మంగళవారం) అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవే కాదు. మరికొన్ని కామెంట్లు కూడా చేశారు. జగన్ డబ్బు ప్రభావంతో గెలుస్తున్నాడని సెలవిచ్చారు. మరి, తెలుగుదేశం పార్టీ గెలిస్తే మాత్రం ప్రజాభిమానంతో గెలిచినట్లా? పంచాయతీ ఎలక్షన్స్ లో టీడీపీకి ఎదురైన ఘోర పరాభవాన్ని జీర్ణించుకోలేక, ఎలా కవర్ చేయాలో తెలియక ఇలా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారా అని అధికార పార్టీవాళ్లు జేసీని ఎద్దేవా చేస్తున్నారు.

CM YS Jagan : do you know one day income of ap cm ys jagan
CM YS Jagan : do you know one day income of ap cm ys jagan

కొస మెరుపు: CM YS Jagan

ఏపీ పాలిటిక్స్ తోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తావించారు. న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలూ ఉన్నాయి కదా అలాంటప్పుడు మళ్లీ ప్రత్యేకంగా పోలీసు విచారణ ఎందుకని జేసీ అనుమానం వ్యక్తం చేశారు. ఇది మాత్రం సెంట్ పర్సెంట్ కరెక్ట్ అనే టాక్ వినిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపైనే ఈ దారుణం జరిగింది. కానీ.. కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ ఉంటాయి. వాటిని ఫాలో కాకుండా ప్రతి నేరగాణ్నీ దిశ క్రిమినల్స్ మాదిరిగా ఎన్ కౌంటర్ చేసేయలేరు. పాలిటిక్స్ లో ఇంత అనుభవం ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి ఇది తెలియంది కాదు కదా అని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Advertisement