Jagan: యుగానికొక్కడు.. వైఎస్ జగన్..

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు యుగానికొక్కడు మాత్రమే పుడతాడేమో అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన అందిస్తున్న సుపరిపాలన చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తోందని అన్నారు. జగన్ సీఎం అయి ఇవాళ ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ‘ప్రజా పాలనకు రెండేళ్లు’ అనే పేరుతో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ని మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ తమ జీవితాల్లో మంచి మార్పు తీసుకొస్తాడనుకున్న ప్రజల ఆకాంక్షలని ముఖ్యమంత్రి జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు.

Jagan

మునుపెన్నడూ లేని..

‘‘ఏపీలో గతంలో ఎప్పుడూ లేని డెవలప్మెంట్ ఈ రెండేళ్లలోనే కనిపిస్తోంది. ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ, ప్రతిక్షణం ఎంతో విలువైందనే ఉద్దేశంతో జగన్ శ్రమిస్తున్నారు. ఐదు కోట్ల ఆంధ్రులను తన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ల బాగు కోసం పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ కలగానే మిగిలిపోయిన ఎన్నో హామీలకు కార్యరూపం ఇస్తున్నారు. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు కాదని నిరూపించారు. సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయాలన్న రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలకు తగ్గట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన, కరోనా, తుఫాన్లు తదితర సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించి విజయవంతంగా ముందుకెళుతున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

Jagan

అంతా ఒకటే..

జగన్ తన పాలనలో అన్ని సామాజిక వర్గాలనీ ఒకే విధంగా చూస్తున్నారు. ఏపీలో ఆయన ఆవిష్కరించిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడు దేశం మొత్తం చూసి అభినందిస్తోంది. ప్రభుత్వ పథకాలను ఎన్నికల ముందు కాకుండా ఒక నిరంతర ప్రక్రియగా చేపడుతున్నారు. అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శక పాలన సాగిస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే జేసీబీ పాలన అని, అవినీతికి పాల్పడ్డవారిని అరెస్ట్ చేస్తే ఏసీబీ పాలన అంటూ వెటకారం చేయటం సరికాదని వైఎస్సార్సీపీAP CM ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పపట్టారు.