CM YS Jagan – BalaKrishna : ఒక హీరో.. ఒక అభిమాని.. తెలుగు.. ఇదీ స్టోరీ.. తెలుసా?..

CM YS JaganBalaKrishna : ఒక హీరో అంటే నందమూరి బాలకృష్ణ. ఒక అభిమాని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు అంటే మనందరి మదర్ టంగ్. ఇవాళ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం. ఈ మూడూ కలిస్తే ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ అవుతుంది. అదెలాగో చూద్దాం. బాలయ్య బాబుకి ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని. ఆ నందమూరి నట వారసుడి సినిమాలని తెగ చూసేవారంట. బాలయ్య మీద జగన్ కి ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉందా లేదా అనేది తెలియదు. బాలకృష్ణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరు. కానీ ఆయన ఫ్యాన్ మాత్రం ఇవాళ ఫ్యాన్ గుర్తు పార్టీకి అధ్యక్షుడు. అంతేకాదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. మరోసారి కూడా సీఎం అవుతారని బాలయ్య తండ్రి (ఎన్టీఆర్) పేరు మీదున్న హెల్త్ యూనివర్సిటీ వీసీ మొన్నే జోస్యం చెప్పారు. అది మరో స్టోరీ. 

తొలి కథలోకొస్తే..

వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుగు మీడియానికి బదులు ఇంగ్లిష్ మీడియాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగు మీడియం అనగానే మళ్లీ వెంటనే బాలకృష్ణ గుర్తొచ్చేలా ఉన్నారు. ఎందుకంటే ‘‘తెలుగు మీడియం’’ అనే పేరుతో ఆయన ఒక సినిమా తీస్తున్నారని అంటున్నారు కాబట్టి. బాలీవుడ్ లో సక్సెస్ అయిన ‘‘అంగ్రేజీ మీడియం’’ (ఇంగ్లిష్ మీడియం) మూవీ తరహాలో దీన్ని తెరకెక్కిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే చిత్రాన్ని టాలీవుడ్ లోకి రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారంట. కాన్సెప్ట్ అదే అయినప్పటికీ తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కథను తయారుచేసి బాలయ్యతో ఫిల్మ్ చేయాలని ప్రొడ్యూజర్లు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

CM YS Jagan-BalaKrishna : today‘s interesting story
CM YS Jagan-BalaKrishna : today‘s interesting story

టుడే అప్డేట్: CM YS Jagan-BalaKrishna

నేడు తేదీ ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృ భాషా దినం. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్టు ప్రస్తావనకు వస్తోంది. ‘‘మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ బాలకృష్ణ మాజీ అభిమాని జగన్ పేర్కొన్నారు. ఇదీ సంగతి.

Advertisement