CM YS Jagan : బైబిల్ పార్టీ కాదు.. హల్లేలూయా పార్టీ అంతకన్నా కాదు..

CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ ఒక మతానికి మాత్రమే చెందిన పార్టీ అనే నెగెటివ్ ముద్ర వేయించటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బైబిల్ పార్టీ అంటూ పొరుగు తెలుగు రాష్ట్రంలోని కమలనాథుడి నోట కఠినంగా మాట్లాడించింది. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా కళ్లు మూసుకొని దానికి వంత పాడుతోంది. హిందూ ఆలయాలపై దాడులకు వైఎస్సార్సీపీయే కారణమంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు ఇటీవల నానా యాగీ చేసింది. కానీ ఆ కుట్రలన్నింటినీ బద్ధలు కొట్టడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఓ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు మరో బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుంది. తద్వారా తన పార్టీ క్రిస్టియన్ పార్టీ కాదని, అన్ని మతాల పార్టీ అనే మెసేజ్ ని పబ్లిక్ లోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తండ్రి బాటలో..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడేళ్లకు (2007లో) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేళ్ల పాటు విజయవంతంగా అమలుచేసింది. అదే కళ్యాణమస్తు. ఈ ప్రోగ్రామ్ కి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులోభాగంగా వివాహం చేసుకున్న పేదింటి ఆడబిడ్డకి 2 గ్రాముల బంగారు మంగళసూత్రంతోపాటు కొత్త జంటకి పెళ్లి వస్త్రాలు ఇచ్చేవారు. వధూవరులతోపాటు 50 మందికి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికోసం ఒక్కో జంటకు 8 వేల రూపాయలు ఖర్చు చేసేవారు. తర్వాత 2011లో వివిధ కారణాల వల్ల కళ్యాణమస్తుకు బ్రేకులు పడ్డాయి. అదిగో.. పదేళ్ల కిందట ఆగిపోయిన ఆ పథకాన్నే తిరిగి ప్రారంభించేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

CM YS Jagan : ap cm ys jagan will start wonderull scheme
CM YS Jagan : ap cm ys jagan will start wonderull scheme

ఒక్క దెబ్బకు: CM YS Jagan

ఏపీలో ఇటీవల హిందూ ఆలయాలపై జరిగిన దాడుల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని బీజేపీ మిత్ర పక్షం జనసేనతోపాటు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు సైతం జగన్ సర్కారును తప్పుపట్టాయి. దీంతో ఒక్క దెబ్బకి ఈ పార్టీలన్నింటికీ కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే ఏపీవ్యాప్తంగా గోపూజ మహోత్సవాన్ని నిర్వహించింది. ఇప్పుడు కళ్యాణమస్తును పెద్దఎత్తున అంటే దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు సమాయత్తమవుతోంది. తద్వారా రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో ముఖ్యంగా బీజేపీకి బలమైన సమాధానం చెప్పేందుకు ఉత్సాహంగా వ్యవహరిస్తోంది. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ఈ ఏడాది మే 28, అక్టోబర్ 30, నవంబర్ 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీటీడీ నాలుగు రోజుల కిందట ప్రకటించింది.

Advertisement