CM Jagan: ముఖ్యమంత్రి జగన్.. ప్రధానమంత్రి లెవల్లో లెక్కలు..

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా టీకాలకు సంబంధించిన లెక్కలను సూపర్ గా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లెవల్లో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని చక్కగా వివరించారు. కొవిడ్-19 వైరస్ తో కలిసి బతకాల్సిందేనని ముందుగా చెప్పిన ముఖ్యమంత్రి కూడా జగనే కావటం విశేషం. ఇప్పుడు సైతం ఆయన అదే స్టైల్లో వ్యాక్సిన్ గణాంకాలను మస్తుగా, సింపుల్ గా వెల్లడించారు. అవన్నీ వింటే ప్రజలు ‘ఔను’ కదా అని అనుకోకమానరు. కేంద్ర ప్రభుత్వమైనా ‘ఎస్.. జగన్ ఈజ్ రైట్’ అని అనాల్సిందే. ఇవాళ గురువారం సాయంత్రం కరోనా వ్యాక్సినేషన్ పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగన్ ఈ డేటాను పేర్కొన్నారు. అదేంటో మనమూ ఒకసారి తెలుసుకుందాం.

టీకా ఉత్పత్తి సామర్థ్యం

దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు మాత్రమే. ఎందుకంటే భారత్ బయోటెక్ కంపెనీ నెలకు కోటి టీకాలను, సీరం ఇన్ స్టిట్యూట్ నెలకు 6 కోట్ల వ్యాక్సిన్లను మాత్రమే అందుబాటులోకి తేగలవు. ఇతర సంస్థల నుంచి టీకాలు రావటానికి మరింత టైం పడుతుంది. అవన్నీ కలిపి ఆగస్టు నాటికి 20 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఆగస్టు నాటికి అంటే జూలై చివరికి అనుకోవచ్చు. అంటే రానున్న మూడు (మే, జూన్, జూలై) నెలల్లో నెలకి 7 కోట్ల చొప్పున మహా అయితే 21 కోట్ల టీకాలనే ఉత్పత్తి చేయగలం. ఇండియాలో 45 ఏళ్లు దాటినవారు 26 కోట్ల మంది. వారికి కావాల్సిన వ్యాక్సిన్ల సంఖ్య 52 కోట్లు.  వారిలో ఇప్పటివరకు 12 కోట్ల మందికే తొలి డోసు ఇచ్చారు. రెండో డోసు 2 కోట్ల 60 లక్షల మందికే వేశారు. మొత్తం కలిపినా 15 కోట్లు మాత్రమే. వీళ్లకే ఇంకా 39 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. ఇన్ని టీకాలు ఉత్పత్తి అయ్యేటప్పటికి ఆగస్టు లేదా సెప్టెంబర్ వెళ్లిపోతాయి.

18-45 ఏళ్ల మధ్యవారు..

దేశంలో 18-45 ఏళ్ల లోపు వయసు వారి సంఖ్య 60 కోట్లు. వీరికి రెండు డోసులకు 120 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. 45 ఏళ్లు పైబడ్డవారికి టీకాలు ఇప్పేటప్పటికే సెప్టెంబర్ దాటిపోతుంది. అంటే 45 ఏళ్ల లోపు వారికి అక్టోబర్ నుంచి వ్యాక్సిన్లు ఇవ్వటానికి వీలుపడుతుంది. ఈ ప్రక్రియకు నాలుగు నెలలు పడుతుంది. అప్పటికి జనవరి పూర్తవుతుంది. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ టీకాలు ఇవ్వాలంటే 2022 జనవరి ఆఖరికి సాధ్యపడుతుంది. కాబట్టి ఫిబ్రవరి వరకు ప్రస్తుత పరిస్థితే కొనసాగుంది. అందువల్ల ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని, శానిటైజేషన్ విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

Advertisement