CM Jagan Mohan Reddy : ఏపీలో వారికి గుడ్ న్యూస్.. నేడు బ్యాంక్ ఖాతాల్లో రూ.10 వేలు జమ..!
NQ Staff - May 16, 2023 / 12:16 PM IST

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి , వైఎస్సార్ భరోసా, నాడు-నేడు లాంటి పథకాలతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మరికొంత మంది ఖాతాల్లోకి రూ.10వేలు జమ చేయబోతున్నారు.
వరుసగా ఐదో ఏడాది కూడా మత్స్యకార భరోసా పథకం కింద జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఈ నగదు మొత్తాన్ని అందజేస్తున్నారు. సీఎం జగన్ నేడు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ బటన్ నొక్కి డబ్బులు వేయబోతున్నారు.
ఈ ఏడాది 1,23,519 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.123.52 కోట్లు జమ చేయనున్నారు. సముద్రంలో వేటపై నిషేధం ఉండటంతో.. జగన్ సర్కార్ మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక దాంతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు విడుదల చేయనున్నారు.

CM Jagan Mohan Reddy Providing Financial Assistance Fishermen
వీటితో పాటు మత్స్యాకారులకు చెల్లించే ఆయిల్ సబ్సిడీని రూ.9కి పెంచారు. ఈ కార్యక్రమం అనంతరం మత్య్సకారులతో జగన్ మాట్లాడుతారు. వారి సమస్యలు ఇంకేమైనా ఉంటే వాటి గురించి కూడా పరిష్కారం ఆలోచిస్తామని గతంలోనే ప్రకటించారు జగన్.