CM JAGAN: తనలాగే తండ్రిని కోల్పోయిన ఓ ఆడబిడ్డను అర్థంచేసుకున్న సీఎం జగన్

CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తనలాగే తండ్రిని కోల్పోయిన ఓ ఆడబిడ్డను అర్థంచేసుకున్నారు. ఆమెకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా ఉన్నత ఉద్యోగం కల్పించారు. ఆమె ఈ రోజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమే.. సింధు సుబ్రహ్మణ్యం. తండ్రి పేరు పి.సుబ్రహ్మణ్యం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. నాటి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మొత్తం ఐదుగురిలో ఆయన ఒకరు. ఈ నేపథ్యంలో కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన తనకు ఉద్యోగం కల్పించాలంటూ సింధు సుబ్రహ్మణ్యం 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు. కానీ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అప్పట్లో ఈ దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు గానీ ఇన్నాళ్లూ పెండింగ్ లో ఉండిపోయింది.

CM Jagan Humanity Towards Poor Women

 

జగన్ సీఎం కావటంతో..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు కావొస్తున్నా సింధు సుబ్రహ్మణ్యం అప్లికేషన్ ముందుకు కదల్లేదు. ఎందుకు ఏమిటి అనే విషయాలను పక్కన పెడితే ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. కారుణ్య నియామకం ద్వారా రామచంద్రాపురం ఆర్డీవోగా అవకాశం కల్పించారు. తద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రజల మనసును మరోసారి గెలుచుకున్నారు. తన కుటుంబాన్ని నమ్మిన వారికి ఆలస్యంగా అయినా న్యాయం జరిగి తీరుతుందని నిరూపించారు. దీంతో సింధు సుబ్రహ్మణ్యం సీఎం జగన్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రమాదం జరిగిన 12 ఏళ్లకి..

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్నాళ్లకే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిగ్నల్స్ కోల్పోయి కర్నూలు సమీపంలోని నల్లమల అడవుల్లో క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో సీఎం వైఎస్ఆర్ తోపాటు పి.సుబ్రహ్మణ్యం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏఎస్సీ వెస్లీ, పైలట్ గ్రూప్ కెప్టెన్ ఎస్కే భాటియా, కోపైలట్ ఎంఎస్ రెడ్డి ఘోరంగా చనిపోయారు. దీంతో వైఎస్ జగన్ మాదిరిగానే సింధూ కూడా తన తండ్రిని కోల్పోయారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 12 ఏళ్లు కావొస్తోంది. సింధు సుబ్రహ్మణ్యం ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నాటి ఘటన గుర్తుకొచ్చింది.

Advertisement