జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీ కొప ముంచేలా ఉంది
Tech Desk-2 - November 19, 2020 / 07:25 PM IST

ఏపీలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతాం అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా పేర్కొన్న విషయం తెల్సిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకునేందుకు వైకాపా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందుకు సంబంధించి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు చాలా బలంగా హామీ ఇస్తున్నారు. ఏపీలో చాలా మంది కొత్త ఇళ్ల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. వైకాపా ప్రభుత్వం కనుక ఆ పార్టీకి చెందిన వారు పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. స్థానిక నేతల వద్ద పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇస్తున్నారు. అందులో సగం మందికి అయినా ఇళ్లు అందుతాయా లేదా అనేది అనుమానంగా ఉంది.

CM Jagan Announced date For House pattas Distribution
ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా నిర్మాణం చేపట్టిన ఇళ్లు జీరో. ఇళ్ల నిర్మాణం కోసం అనేక సార్లు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినా కూడా ఏదో ఒక అడ్డు వచ్చి ఆగింది. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం పట్టాల పంపిణీ కి సంబంధించి కార్యక్రమం అయిదు సార్లు వాయిదా పడింది. డిసెంబర్ 25వ తారీకున ఆ కార్యక్రమంకు సంబంధించిన మళ్లీ ముహూర్తం పెట్టారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇళ్ల స్థలాలను పంచాలని భావిస్తున్నారు. మొత్తం 30.6 లక్షల ఇళ్ల స్థలాలను గుర్తించారు. 25వ తారీకున ఆ మొత్తం ఇళ్ల స్థలాలను స్థానిక నేతలు, మంత్రులు ఇవ్వబోతున్నారు. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టబోతున్నారు. అదే సమయంలో రెండవ దశ లో మరో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు.
ఈ ఇళ్ల నిర్మాణం మరియు పంపిణీ విషయంలో అసంతృప్తి వ్యక్తం అయితే మాత్రం ఖచ్చితంగా వైకాపా కార్యకర్తల నుండి సామాన్య జనాల వరకు అంతా కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టే అవకాశం ఉంది. అన్ని ఇళ్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కేటాయింపుల్లో ఏదైనా మతలబు జరిగినా కూడా ఖచ్చితంగా ప్రజలు అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. జగన్ హామీ ఇచ్చినాడు బాగానే ఉంది.. వాటిని కింది స్థాయి వారు ఎలా అమలు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇళ్ల స్థలాలు ఇళ్ల పంపిణీ విషయం తేడా కొడితే ఖచ్చితంగా కొంప మునిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిని వైకాపా ఎలా ఓవర్ కమ్ చేస్తుంది అనేది చూడాలి.