YS Jagan: కాస్త డిలే చేసిన జ‌గ‌న్.. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో చిరుతో భేటి

YS Jagan: క‌రోనా వ‌ల‌న సినీ ప‌రిశ్ర‌మ అనేక ఇబ్బందుల‌ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా థియేట‌ర్స్ మూత ప‌డ‌డంతో చాలా సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. మ‌రోవైపు క‌రోనాతో భారీగా న‌ష్ట‌పోయిన క్ర‌మంలోటిక్కెట్స్ రేటు కూడా పెంచాల‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చిరంజీవి అధ్య‌క్ష‌త‌న సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌తో చ‌ర్చించాల‌ని కొన్నాళ్లుగా భావిస్తున్నారు. ఇటీవ‌ల కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఆహ్వానం ప‌లికారు.


Chiru to meet YS Jagan
Chiru to meet YS Jagan


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా ఉన్న చిరంజీవి ఈ నెల చివ‌రి వారంలో జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్నారని, ఈ కీల‌క భేటీలో ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య, సినీ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకుదెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి మాట్లాడే అవ‌కాశం ఉందని భావించారు. కాని త‌న ఫ్యామిలీతో సిమ్లాకు ఐదు రోజుల ట్రిప్ వేసిన క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 4న చిరుతో పాటు ప‌లువురు సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌ని క‌ల‌వ‌బోతున్నట్టు తెలుస్తుంది.


ఇటీవ‌ల చిరంజీవి ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు పెద్ద‌ల‌ని త‌న ఇంటికి ఆహ్వానించి ప‌లు అంశాల గురించి చర్చించిన విష‌యం తెలిసిందే. ఈ నెలాఖ‌రున మీటింగ్ ఉంద‌నుకుంటే, అది వ‌చ్చే నెల‌కు పోస్ట్ పోన్ అయింది. ఈమీటింగ్ త‌ర్వాత చాలా సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఓ క్లారిటీ రానుంది.


కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం భారీగా నష్టపోయిన ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ కూడా టాప్ లో ఉందని చెప్పవచ్చు. చాలామంది సినీ కార్మికులు తినడానికి తిండి లేక కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారంపై మెగాస్టార్ చిరంజీవి గతంలోనే కొంత మంది రాజకీయ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రులతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు.