Chandrababu : కుప్పంలో చంద్రబాబు నాన్ లోకల్ : వైఎస్ జగన్ సంచలన విమర్శ.!

NQ Staff - September 23, 2022 / 06:44 PM IST

160343Chandrababu : కుప్పంలో చంద్రబాబు నాన్ లోకల్ : వైఎస్ జగన్ సంచలన విమర్శ.!

Chandrababu : కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాన్ లోకల్.. అంటూ సంచలన విమర్శ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Chandrababu is non local in Kuppam comments YS Jagan

Chandrababu is non local in Kuppam comments YS Jagan

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘వైఎస్సార్ చేయూత పథకం కింద నిధుల విడుదల’ కార్యక్రమాన్ని చేపట్టారు.

బహిరంగ సభలో వైఎస్ జగన్ రాజకీయ విమర్శలు..

కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గానికి చాలా ఏళ్ళు ఎమ్మెల్యేగా వున్న చంద్రబాబు, ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు వైఎస్ జగన్. పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా వుండి కూడా కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు వైఎస్ జగన్.

హైద్రాబాద్‌కే చంద్రబాబు లోకల్.. కుప్పం నియోజకవర్గానికి మాత్రం నాన్ లోకల్.. అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. అదే నిజమైతే, పులివెందుల నియోజకవర్గానికి వైఎస్ జగన్ నాన్ లోకల్ అని ఒప్పుకున్నట్లేనా.? అని టీడీపీ ఎదురుదాడి షురూ చేసింది.

కాగా, కుప్పం నియోజకవర్గాన్ని గెలిచే లక్ష్యంతో వైసీపీ అధినేత పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.