Chandra-Swami : సుబ్రహ్మణ్య స్వామి ఎట్టకేలకు రంగంలోకి దిగాడు. ఇక మన చంద్రబాబు నాయుడి భవిష్యత్తేంటో ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఈ స్వామి గతంలో ఎన్ని గట్టి పిండాల్ని గడగడ లాడించాడో భారతదేశానికి తెలుసు. తెలుగుదేశానికి త్వరలో ప్రత్యక్ష అనుభవంలోకి రాబోతోంది. ఇంతకీ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరు స్వామీ అనేదే కదా ప్రశ్న. అక్రమార్కుల పట్ల ఈ సుబ్రహ్మణ్యుడు ఎంత పట్టువదలని విక్రమార్కుడో తెలియాలంటే పెద్ద పెద్దోళ్లను అడిగితే మా బాగా చెబుతారు. కాంగ్రెస్ హైకమాండ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు (స్టిల్ బ్యాచిలర్) రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, అన్నాడీఎంకే జయలలిత, డీఎంకే ద్వయం రాజా-కనిమొళి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తదితరులను కలల్లోనూ వెంటాడాడు. ఇందులో కొందర్ని కటకటాల పాల్జేశాడు. అయోధ్య, ఈవీఎం, బ్లాక్ మనీ.. ఇలా చెప్పుకుంటూపోతే సుబ్రహ్మణ్యస్వామి ప్రమేయంలేని ప్రధాన పరిణామం సమకాలీన దేశ రాజకీయల్లో లేదంటే అతిశయోక్తి కాదు.
ఇంతకీ ఈయన ఎవరంటే?..
సుబ్రహ్మణ్య స్వామి ఒక మేధావి. బీజేపీ నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. గతంలో కేంద్ర మంత్రిగా చేశాడు. ఇండియాలో ఏ మూలన అవినీతి జరిగినా ఈయన పసిగడతాడు. అంతటితో ఆగడు. సుప్రీంకోర్టు దాకా లాగుతాడు. కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడ్డా, ఏళ్లకేళ్లు గడిచినా నిందితులు దోషులుగా తేలటం, అక్కడి నుంచి డైరెక్టుగా జైలుకే వెళ్లటం తథ్యం. ఆ తర్వాత వాళ్ల పొలిటికల్ ఫ్యూచర్ క్లోజ్ కావటమే. అయితే సుబ్రహ్మణ్య స్వామికీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటంటే ఈయన బేసిగ్గా పక్కా హిందూ. తిరుమల శ్రీవారి భక్తుడు. తెలుగులోని ఒక వర్గం మీడియా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పుడు ప్రచారం చేయటం పట్ల సుబ్రహ్మణ్య స్వామి నొచ్చుకున్నారు. విసుగు చెందారు.

వదల బొమ్మాళీ: Chandra-Swami
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని క్రైస్తవీకరిస్తున్నారంటూ ఒక వర్గం మీడియా పనిగట్టుకొని ఫేక్ న్యూస్ ని టెలికాస్ట్ చేస్తుండటం వల్ల ఆయన చిరాకుతో మొన్న తెర మీదికి వచ్చారు. ఆ ఛానల్ పై మొదట పరువు నష్టం కేసు వేస్తానని ట్విట్టర్ లో హెచ్చరించారు. ఆ మీడియాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నాడని మండిపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక కేసును టేకప్ చేశాడంటే దాని అంతు చూసేదాక వదిలిపెట్టడు. కాబట్టి ఆ ఛానల్ యజమాని, దానికి ఫండ్స్ ఇస్తున్న చంద్రబాబు పరిస్థితి భవిష్యత్తులో జైలు ఊచలు లెక్కపెట్టడమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
I am quite fed up getting bogus information that TTD is Christianizing the temple. CBN financed media are responsible. So I have decided to make a test case of one media outlet in a defamation case as Balaji Bhakt.
— Subramanian Swamy (@Swamy39) March 5, 2021