Chandra babu : ‘చంద్రబాబు గారు కావాలి’ అంటూ ఢిల్లీ, ముంబై నుంచి ఎవరొచ్చారో తెలుసా?

Chandra babu : ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా సైకిల్ ‘చక్రం’ గిర్రున తిప్పిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ తో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాకపోతే గతంలో మాదిరిగా బీజేపీతో కలిసి కాదట. కమలానికి ధీటుగా నిలబడగలిగే పార్టీతో అని చెబుతున్నారు. ఆ జర్నీ జాతీయ రాజధానికి ముంబై మీదుగా సాగబోతోందని అంటున్నారు. దానికి స్కెచ్ ఇప్పటి నుంచే గీస్తున్నారని సమాచారం.

అక్కడెవరు?

ప్రస్తుతం మహారాష్ట్రని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి పాలిస్తోంది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. దాదాపు ఏడాదిన్నర కిందట సీఎం పీఠం తమకే కావాలన్న డిమాండ్ కు ఒప్పుకోని బీజేపీకి శివసేన అదిరిపోయే షాక్ ఇచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ కరెక్టుగా ఆ శివసేన మీద పడిందని భోగట్టా. వచ్చే జమిలి ఎలక్షన్స్ లో గానీ జనరల్ ఎలక్షన్స్ లో గానీ ఆ పార్టీతో నేషనల్ లెవల్ లో జట్టు కడతాడట.

ఆ రెండూ: Chandra babu

2019 లోక్ సభ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో కమలంతో పొత్తు పెట్టుకున్నాడు. హస్తం పార్టీతో చేతులు కలపటం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. పైగా ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పట్లో కోలుకునే స్థితిలో కూడా లేదు. దీంతో దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే టీడీపీ చీఫ్ జాతీయ స్థాయిలో మూడో కూటమికి ముందుచూపుతో పావులు కదుపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Chandra-babu-planning-to-form-third-front
Chandra-babu-planning-to-form-third-front

నో స్పేస్..

ఏపీలో టీడీపీ బీజేపీతో మరోసారి జట్టు కట్టే సూచనలు కనుచూపు మేరలో కూడా లేవు. కాషాయం పార్టీతో ఒక వైపు జగన్, మరో వైపు జనసేన క్లోజ్ గా మూవ్ అవుతున్నాయి. కాబట్టి తెలుగుదేశానికి అక్కడ కూర్చోటానికి చోటు లేదు. చంద్రబాబు నేషనల్ లెవల్ లో ఒక్క శివసేనతో మాత్రమే కాదట. ఢిల్లీలో కేజ్రీవాల్ ‘ఆప్’తో కూడా కలిసి నడవటానికి ప్రయత్నాలు ప్రారంభించారని వినికిడి. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీతోనూ మంతనాలు జరుపుతున్నారట. మూడు నాలుగు నెలల్లో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో అక్కడ ఎవరు గెలుస్తారనేదాన్ని బట్టి కూటమి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారని భావిస్తున్నారు.

Advertisement