Chandra Babu Naidu : పాదయాత్ర వెంట లోకేష్‌తోపాటు చంద్రబాబు కూడా.?
NQ Staff - November 26, 2022 / 12:25 PM IST

Chandra Babu Naidu : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. 4 వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది. దాదాపు 400 రోజులపాటు పాదయాత్ర జరిగేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.
కాగా, పాదయాత్రలో నారా లోకేష్ వెంట టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వుండేలా అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది టీడీపీ అధినాయకత్వం. మరి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేయబోతున్నారు.? పాదయాత్ర సమయంలో చంద్రబాబు రాజకీయ పర్యటనలు ఎలా వుంటాయి.?
లోకేష్తోపాటే పాదయాత్ర..
నారా లోకేష్‌తోపాటు ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబు కూడా కొంత దూరం పాదయాత్ర చేస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా టీడీపీలో లోతైన చర్చ జరుగుతోంది.
అయితే, తండ్రి చాటు బిడ్డ.. అనే ఇమేజ్ నుంచి నారా లోకేష్ బయటపడాలి గనుక, చంద్రబాబు ఈ పర్యటనలకు దూరంగా వుంటేనే బెటరన్న ఆలోచన కూడా కనిపిస్తోంటి టీడీపీలో. ప్రతి నియోజకవర్గంలోనూ కాకపోయినా, అక్కడక్కడా లోకేష్ వెంట చంద్రబాబు కూడా కొంత దూరం పాదయాత్ర చేసే అవకాశం లేకపోలేదు.
నారా లోకేష్ పాదయాత్రకు సమాంతరంగా చంద్రబాబు బస్సు యాత్ర చేస్తే ఎలా వుంటుంది.? అన్న కోణంలోనూ టీడీపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట.