చాప కింద నీరులా విస్తరిస్తున్న బాబు.. చూసుకో జగన్ కాస్త
Tech Desk-2 - December 7, 2020 / 06:38 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంను ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు కేవలం అయిదు సంవత్సరాలకే ప్రజలు అధికారం నుండి చేయడంతో చాలా కసిగా ఉన్నాడు. దానికి తోడు జగన్ ఒక ఆట ఆడుకుంటూ ఉండటం వల్ల టీడీపీ నాయకులు మరింతగా పట్టుదలతో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ను అధికారం నుండి దించేందుకు మెల్లగా పావులు కదుపుతున్నాడు. జగన్ అధికారంలో ఉన్న కారణంగా ఏ పని బయటకు కనిపించేలా చేసినా కూడా దాన్ని వీగి పోయేలా చేయగలడు. అందుకే సీఎం పదవి కోసం చంద్రబాబు నాయుడు చాపకింద నీరులా మెల్లగా విస్తరిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Chandra babu naidu plans for next elections
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు జగన్ ప్రభుత్వం లోటు పాట్లను తమ మీడియా ద్వారా చేతికి మట్టి అంటనివ్వకుండా జాగ్రత్తగా ప్రచారం చేస్తున్నాడు అనేది ఒక వాదన అయితే సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వం తాళూకు అక్రమాలు మరియు అనుభవరాహిత్యంను క్లీయర్ గా వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు పార్టీ కింది స్థాయి నాయకులను ఇప్పటి నుండే సమాయత్తం చేసేందుకు సిద్దం అయ్యాడు. త్వరలో క్షేత్ర స్థాయి నాయకులతో భేటీలు అవ్వడం పార్టీని బలోపితం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట.
కింది స్థాయిలో జరుగుతున్న అవినీతి మరియు జగన్ ప్రభుత్వం విఫలం అయిన రంగాలకు సంబంధించి అందరికి చేరు అయ్యేలా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలను వినియోగించుకోబోతున్నాడు. పార్టీ కార్యకర్తలే ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా కింది స్థాయి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సైలెంట్ గా ఉన్నాడని జగన్ భావించి ఆయన్ను లైట్ తీసుకుంటున్నాడు. అలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనాలు జగన్ ను పక్కకు పెట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అందుకే ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండు జగన్ అంటూ వైకాపా నాయకులు సైతం అంటున్నారు.