Chandra Babu Naidu : నన్ను, లోకేష్ ను చంపేస్తారు : చంద్రబాబు
NQ Staff - November 30, 2022 / 08:23 PM IST

Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దెందులూరు లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తనను మరియు లోకేష్ ని చంపేందుకు కుట్ర జరుగుతుందని, వాళ్లు తలుచుకుంటే బాబాయిని చంపినట్లుగా తమను కూడా చంపేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి వెంట పోలీసులు ఉంటే తనకు ప్రజల బలం ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికలు నాకు చివరి అవకాశం కాదని.. ప్రజలకు చివరి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టత చేశాడు.
ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వైకాపా ఆగడాలను చూడాలని, మరో సారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదని పేర్కొన్నారు. వైకాపా వారు చేసే తాటాకు చప్పుళ్ళకు తాను భయపడేది లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు.