రాయపాటి స్కామ్ లో చంద్రబాబు త్వరలోనే అరెస్ట్ ?? సాలిడ్ ప్రూఫ్ ఇదే ?

Admin - December 24, 2020 / 11:59 PM IST

రాయపాటి స్కామ్ లో చంద్రబాబు త్వరలోనే అరెస్ట్ ?? సాలిడ్ ప్రూఫ్ ఇదే ?

రాయపాటి స్కామ్ లో చంద్రబాబు త్వరలోనే అరెస్ట్బు: ధవారం నాడు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకులను దోచుకోవడంలో చంద్రబాబు మరియు అతని పార్టీ నేతలు గ్యాంగ్‌స్టర్స్‌ని, స్కామ్‌స్టర్స్‌ని మించిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌మోడీ, దావూద్‌ ఇబ్రహీం కంటే ఘోరంగా దేశం పై పడి బ్యాంకులను దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

Chandrababu naidu

Chandrababu naidu

ట్రాన్స్‌ట్రాయ్‌ ముసుగులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దేశవ్యాప్తంగా రూ.7,296 కోట్ల స్కామ్‌కి పాల్పడ్డారని.. ఈ స్కామ్ లో చంద్రబాబుకు ఎన్ని వందల కోట్ల రూపాయల వాటా ఉందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నీడలో రాయపాటి అవినీతి వృక్షంగా పెరిగారని ఆయన దుయ్యబట్టారు. రాయపాటి చేసిన స్కామ్ కార్యకలాపాలలో చంద్రబాబుకి ఎటువంటి వాటాలు లేకుంటే సీబీఐ విచారణ గురించి స్పందించాలని జోగి రమేష్ చాలెంజ్ చేశారు. వేల కోట్ల స్కామ్ కి ప్రధాన అడ్డాగా మారిన ట్రాన్స్‌ట్రాయ్‌ ని ఐదేళ్లపాటు నెత్తిన పెట్టుకొని మోసింది మరెవరో కాదు చంద్రబాబు నాయుడేనని ఆయన గుర్తుకు తెచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు అన్నీ ప్రస్తుతం ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అవినీతి పై చర్చించడానికి ఎక్కడికి రావడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్‌, రుత్విక్‌ అసోసియేట్‌ వంటి 9 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి 13 బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకొని మళ్లీ తిరిగి ఇవ్వకుండా ఎగొట్టారని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్, వాకాటి నారాయణరెడ్డి, దీపక్‌రెడ్డి, బొల్లినేని రామారావు వంటి నేతలు బాబుతో చేయి కలిపి అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి స్కామ్‌స్టర్ల తో కూర్చుని ప్రతిరోజు ఆన్‌లైన్‌లో చంద్రబాబు నాయుడు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us