Chandra babu: ఇలాంటివి చేసే మళ్ళీ చంద్రబాబు ని సి‌ఎం చేసేలా ఉన్నారు .. మూర్ఖపు నిర్ణయం.

AP Police association president fire on tdp and chandra babu naidu
AP Police association president fire on tdp and chandra babu naidu

Chandra babu (చంద్రబాబు): ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొన్ని సన్నివేశాలు సినిమాలో చుసిన మాదిరిగానే అనిపిస్తున్నాయి. ఓ సినిమాలో అవన్నీ కాదు.. నేను నిన్ను పాడు చేశానని చెప్పు.. నేను కూడా నిజమే అని ఒప్పుకుని జైలుకు వెళ్తా.. అని హీరోయిన్ తో హీరో అంటాడు. ఇక తనపై ఉన్న పగను ఇలా తీర్చుకొమ్మని సలహా ఇస్తాడు. ఇక ఇప్పడు ఏపీ పోలీసులు కూడా ప్రతిపక్ష నేతలపై ఇదే పగతో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామనుకున్న ప్రతిపక్ష నేతల్ని ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేయాలని పోలీసులు డిసైడ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక చివరికి వారిపై రేప్ కేసు కూడా పెట్టేస్తున్నారు.

అయితే సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన టీఎన్ఎస్ఎప్ నేతలపై ఏకంగా రేప్ కేసు పెట్టారు పోలీసులు. ఇక వారిని రిమాండ్ రిపోర్టులోనూ రేప్ చేయబోయారని రాసి.. న్యాయమూర్తికి సమర్పించారు. ఇక రిమాండ్ రిపోర్టు చూసి.. న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురైయ్యారు. సీఎం ఇంటిని ముట్టడిస్తే.. రేప్ కేసు ఏంటని పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరో ఐదుగురు టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు మరోసారి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈసారి వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

ఇక పోలీసులు తప్పయిపోయిందని.. కేసు పెట్టిన సెక్షనుల మాత్రం అత్యాచారం కాదని చెబుతున్నారు. అయితే మనకు తెలిసినంత వరకు ముట్టడి కార్యక్రమాలకు పోలీసులు కేసులు పెట్టరు. కానీ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో రెండు, మూడు గంటలు ఉంచి మరల పంపేస్తారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలంటే.. ఏపీ పోలీసులు సందు దొరికితే.. అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాక ఎవరో వాటర్ బాటిళ్లు వేస్తే చంద్రబాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తున్నారు. ఇక్కడ రేప్ కేసులు పెట్టారు. అభాసు పాలయ్యారు. మొత్తానికి ఏపీ పోలీసుల పని తీరు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది.

Advertisement