Chandra Babu: ‘‘కేసీఆర్.. క్యా బాత్ హై..’’ అన్నావ్ కరెక్టే. కానీ.. కొడాలి సంగతేంటి?..

Chandra Babu మన శత్రువుకి శత్రువు మనకి ఏమవుతాడు?. అజాత శత్రువు. ఇది ముగ్గురు ‘‘జాతిరత్నాలు’’లోని ఒక రత్నం చెప్పిన సమాధానం. సరైన ఆన్సర్ ఏంటంటే మన శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అవుతాడు. చంద్రబాబుకి జగన్ రాజకీయ శత్రువు. జగన్ కి కొన్ని విషయాల్లో (ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోణంలో) కేసీఆర్ శత్రువు. కాబట్టి పైన చెప్పుకున్న సూత్రం ప్రకారం చంద్రబాబుకి కేసీఆర్ మిత్రుడు. జగన్ ని విమర్శించటానికి ఆయన మాటలను చంద్రబాబు తనకి అనుకూలంగా మలచుకున్నాడు. నిన్న గురువారం తిరుపతిలో జరిగిన ఉప ఎన్నిక ప్రచార సభలో చంద్రబాబు ఈ మేరకు కేసీఆర్ ని మెచ్చుకున్నారు.

అసలేంటి బ్యాంక్ గ్రౌండ్?..

మొన్నామధ్య కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో ఆంధ్రాలో ఒక ఎకరం భూమి అమ్మితే వచ్చే డబ్బులతో తెలంగాణలో మూడెకరాలు కొనే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం బాగా డెవలప్ అయిందని, భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఈ పరిస్థితిలో తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే వచ్చే డబ్బులతో ఆంధ్రాలో రెండెకరాల భూమి కొనొచ్చని వివరించారు. తెలంగాణలో భూముల రేట్లు భారీ పెరిగాయని చెప్పారే తప్ప ఆంధ్రాలో భూముల రేట్లు తగ్గాయని గానీ దానికి అక్కడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం అని గానీ కేసీఆర్ అనలేదు. కానీ.. కేసీఆర్ చేసిన ఈ కామెంట్లను చంద్రబాబు వక్రీకరించారు. ‘‘ఏపీలో ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే తెలంగాణలో అర ఎకరం అమ్మినా చాలు ఆంధ్రాలో ఏకంగా పది ఎకరాలు కొనొచ్చు. దీనికి జగనే కారణం. ఏదేమైనా కేసీఆర్ విశ్లేషణకి అభినందనలు’’ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

kodali nani
kodali nani

మరి, కొడాలి నానీ మాటలకేంటి?..

కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నానీ కూడా గతంలో స్పందించారు. అసలు చంద్రబాబు కేసీఆర్ ని ఆనాడు తన కేబినెట్ లోకి తీసుకొని ఉంటే ఆయన తెలుగు దేశం పార్టీ నుంచి బయటికి వచ్చేవాడు కాదని, టీఆర్ఎస్ పార్టీని పెట్టేవాడు కాదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగేది కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితే వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ని ప్రశంసించిన చంద్రబాబు.. కొడాలి నానీ అన్నదానికి ఎందుకు సమాధానం చెప్పలేదు అని అనలిస్టులు అడుగుతున్నారు.

Advertisement