Chandra Babu: తిరుపతి ఎన్నికను రద్దు చేయాలనటం కాదు.. బహిష్కరించకపోయావా బాబూ..

Chandra Babu తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రతిపక్ష తెలుగుదేశం ఎలాగూ గెలిచే సూచనల్లేవని ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబుకు ఒక రోజు ముందే అర్థమైందేమో. ప్లేటు ఫిరాయించారు. ఈ బైఎలక్షన్ ని రద్దు చేయాలంటూ నిన్న శుక్రవారమే కోరారు. ‘అసలు ఎందుకీ ఎన్నిక’ అంటూ అసహనం ప్రదర్శించారు. మొన్నటి దాకా రాళ్ల దాడి పేరుతో రచ్చ చేయాలని చూశారు. ఈ రోజు దొంగ ఓట్లు అనే కొత్త ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను, ఎన్నికల సంఘాన్ని, వాలంటీర్లను, పోలింగ్ సిబ్బందిని.. ఇలా ప్రతి వ్యవస్థనీ తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది. తప్పు చంద్రబాబులో ఉంది కాబట్టే ప్రతిదీ ఆయనకి తప్పుగానే కనిపిస్తోంది. ఎలక్షన్ లో పాల్గొనటం అంతగా ఇష్టంలేకపోతే పరిషత్ ఎన్నికల మాదిరిగా దీన్ని కూడా బహిష్కరించొచ్చు కదా అని విమర్శకులు నిలదీస్తున్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ.. సేమ్ డైలాగ్..

చంద్రబాబు నాయుడి దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే తన ఎల్లో పార్టీ అండ్ ఎల్లో మీడియా. వాళ్లు మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడతారు. మిగతావాళ్లు ఖూనీ చేస్తారు. తిరుపతిలో స్థానికులు ఓట్లు వేయకుండా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుంటున్నారని బాబు ఆరోపించారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే జనాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ.. అదేమీ జరగలేదు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి తప్ప అధికార పార్టీ వైఎస్సార్సీపీ కోసం, సీఎం వైఎస్ జగన్ కోసం కాదని హితవు పలికారు. ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. తిరుపతి, తిరుమలకి బయటి ప్రాంతాలవాళ్లు రావటం ఇవాళ మాత్రమే జరగలేదు. రోజూ అక్కడి దేవుణ్ని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

చెక్ పోస్టులు.. తనిఖీలు..

‘‘వేరే ప్రాంతాల నుంచి ప్రజలు తిరుపతికి వస్తుంటే బోర్డర్లను మూసేసి చెక్ చేయాలి. ఆ తర్వాతే సిటీలోకి పంపించాలి. కానీ పోలీసులు చెక్ పోస్టులను ఎందుకు ఎత్తేశారో తెలియదు. వేర్వేరు ఏరియాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి టూరిస్టులు అంటున్నారు. వెబ్ క్యాస్టింగ్ ని గాలికొదేశారు. ఈ అవకతవకలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. తిరుపతిలో ప్రజాస్వామ్యం నవ్వుల పాలైంది. ప్రతిపక్షాలు డెమొక్రసీని కాపాలని చూస్తుంటే వైఎస్సార్సీపీ ఖతం చేయాలని చేస్తోంది. పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించారు. వీటన్నింటికీ ఆధారాలను ఎన్నికల కమిషన్ లో సమర్సిస్తా. తిరుపతి ఉప ఎన్నికని పూర్తిగా రద్దు చేయాలి. కేంద్ర బలగాలు, సిబ్బందితో మళ్లీ పోలింగ్ పెట్టాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement