Chandra Babu : 3 ప్లస్ 2: కొత్త ప్రతిపాదన పవన్ ముందుంచిన చంద్రబాబు.?

NQ Staff - October 18, 2022 / 10:52 PM IST

Chandra Babu : 3 ప్లస్ 2: కొత్త ప్రతిపాదన పవన్ ముందుంచిన చంద్రబాబు.?

Chandra Babu : ‘మీరు మూడేళ్ళు అధికారంలో వుండండి.. మాకు రెండేళ్ళు అధికారం ఇవ్వండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ ప్రతిపాదన పెట్టారట.! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘అధికారానికి’ సంబంధించి ప్రతిపాదన పవన్ ముందుంచేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు జనసేన అధినేతను కలిసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల గురించి కాదని పవన్ చెప్పినాగానీ.. తెలుగుదేశం పార్టీ మూడేళ్ళపాటు తొలుత అధికారంలో వుంటుంది.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి జనసేనకు రెండేళ్ళపాటు అధికారమిస్తాం.. అని అప్పుడే టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విశ్లేషించేస్తున్నారు. కాదు కాదు, తేల్చేస్తున్నారు. కానీ, తొలుత జనసేన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చంద్రబాబు ప్రతిపాదన చేశారన్నది తాజా ఖబర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని దించడం అనేది జనసేన కంటే, తెలుగుదేశం పార్టీకే అవసరం.

అందుకే, ఈ ప్రతిపాదన చంద్రబాబు చేశారట. పవన్ మాత్రం, ‘ఇప్పుడైతే అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి వచ్చి, వైసీపీ దుర్మార్గాలని ఎండగట్టాలి..’ అని చంద్రబాబుకి తేల్చి చెప్పారట. అదే విషయాన్ని పవన్ స్పష్టంగానే మీడియా ముఖంగా చంద్రబాబుకే చెప్పేశారు కూడా.!

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us