CBI Court: రఘురామ కృష్ణంరాజు పిటీషన్ తిరస్కరణ.. జగన్, విజయసాయి కి పెద్ద ఊరట
NQ Staff - September 15, 2021 / 03:55 PM IST

CBI Court: ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేయగా,దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం రఘురామ పిటిషన్లను కొట్టివేసింది.
బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో సంబంధం లేని రఘురామ పిటిషన్ విచారణ అర్హతపై మొదట సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సైతం తిరస్కరించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు సైతం ఇవాళ కొట్టివేసింది. విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరించింది
వైఎస్ జగన్, విజయసాయిరెడ్డికి అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రతివాదులైన జగన్, సాయిరెడ్డితో పాటు దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ కూడా కౌంటర్లు ఇచ్చింది. అయితే సీబీఐ ఇచ్చిన మెమోలో తన వాదన వినిపించకుండా కోర్టునే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.