Botsa Satya Narayana: అపోలో ఆసుప‌త్రిలోచేరిన బొత్స‌.. కరోనా సోకిన‌ట్టు టాక్

Botsa Satya Narayana: క‌రోనా మ‌హమ్మారి బెడ‌ద‌ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ను సైతం వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే కరోనాతో ఎంతో మంది మృతి చెంద‌గా, కొంద‌రు చావు వ‌ర‌కు వెళ్లి వ‌చ్చారు. క‌రోనాని నిర్ల‌క్ష్యం చేస్తే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. తాజాగా ఏపీ మున్సిప‌ల్ శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.

Botsa Satya narayana Joined in Hospital Due to covid
Botsa Satya narayana Joined in Hospital Due to covid

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కి అపోలోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అత‌నికి వైద్య‌బృందం ప్ర‌త్యేక వైద్యం అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త రెండు రోజుల నుంచి మంత్రి బొత్స… కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని… ఈ నేపథ్యం లోనే ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా,పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలుస్తుంది.

మెరుగైన చికిత్స కోసం ఆయన అపోలో ఆస్పత్రి లో చేరినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 49,568 మందికి పరీక్షలు నిర్వహించారు. 1,125 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కి చేరింది. వైరస్ తో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ) బారిన పడి చనిపోయినవారు మొత్తం సంఖ్య 14,019కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,356 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు 20,03,543 మంది కోలుకున్నారు.