TDP: ఇన్నాళ్లూ సైలెంటుగా ఉన్న ఒక పెద్ద టీడీపీ బ్యాచ్ – ఎలక్షన్ టైమ్ లో రంగంలోకి దిగారు..

big tdp batch jumped into election war
big tdp batch jumped into election war

TDP ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలీ కావాలీ అని అరిచి గీ పెట్టిన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి తీరా అవి వచ్చాక గానీ అసలు విషయం అర్థం కావట్లేదు. ఎలక్షన్సన్న తర్వాత.. ఒకసారి బరిలోకి దిగాక.. ప్రత్యర్థికి ఇక ఏమాత్రం తగ్గకూడదు. సై అంటే సై అనాలి. ఎదుటివాడు రూపాయి ఖర్చు పెడితే మనం రెండు రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండాలి. అపొజిషన్ క్యాండిడేట్ ని మూడు చెరువుల నీళ్లు తాగించాలి. పల్లెల్లో ఇలాంటి పట్టింపులు, పౌరుషాలు మరీ ఎక్కువ.

కానీ.. తుస్.. TDP

టీడీపీ.. గొప్ప కోసం పైకి ఎన్ని సవాళ్లు చేస్తున్నా లోపల లోపల మాత్రం కుమిలిపోతోంది. బస్తీమే సవాల్ అనలేక బక్కచిక్కిపోతోంది. ఢీ కొట్టలేక ఢీలా పడిపోతోంది. దీంతో చాలా చోట్ల నామినేషన్లు వేయటానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందని అంటున్నారు. గ్రౌండ్ లెవల్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని టీడీపీ వర్గాలే అసహనం ప్రదర్శిస్తున్నాయి. జూమ్ యాప్ ముందు కూర్చొని లక్షా తొంభై చెప్పొచ్చు గానీ క్షేత్ర స్థాయికి వస్తేనే కదా వాస్తవాలు బోధపడతాయి అంటూ వాళ్లు బాధపడుతున్నారు.

అధికారం..

లోకల్ బాడీ ఎలక్షన్స్.. బై ఎలక్షన్స్.. ఇలా.. ఎన్నికలు ఏవైనా గానీ అధికారంలో ఉన్న పార్టీకే కాస్త అనుకూల పరిస్థితులు ఉంటాయి. పవర్ లో ఉన్న పార్టీని గెలిపించుకుంటే పనులవుతాయని ప్రజలు, ఓటర్లు, లీడర్లు భావిస్తారు. ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ఏకగ్రీవాలైనా, ఎన్నికల్లో విజయాలైనా ఆ పార్టీ ఖాతాలోనే ఎక్కువ చేరతాయని పరిశీలకులు పక్కాగా పేర్కొంటున్నారు.

ఇప్పుడు వైలెంట్..

గతేడాది కరోనాకి ముందు లోకల్ బాడీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు ఆహ్వానించగా పోటీకి తెలుగు తమ్ముళ్లు జంకారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వెనకడుగు వేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఎక్కువ ఏకగ్రీవాలు నమోదు కావటం విశేషం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఇలాకా అయిన శ్రీకాకుళంలో మాత్రం ఇన్నాళ్లూ సైలెంటుగా ఉన్న ఒక పెద్ద టీడీపీ బ్యాచ్ ఎలక్షన్ టైమ్ లో రంగంలోకి దిగి కాస్త ఫర్వాలేదనిపిస్తోంది.

Advertisement