Bharat Rashtra Samithi : ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే నా ఓటు ఆ కేసీయార్‌కే: ఉండవల్లి అరుణ్ కుమార్

NQ Staff - October 6, 2022 / 03:32 PM IST

Bharat Rashtra Samithi : ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే నా ఓటు ఆ కేసీయార్‌కే: ఉండవల్లి అరుణ్ కుమార్

Bharat Rashtra Samithi : తెలుగు రాష్ట్రాల్లో భారత్ రాష్ట్ర సమితి గట్టిగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘ఆ పార్టీతో మాకేమీ నష్టం లేదు..’ అని వైసీపీ నేతలు చాలామంది చెబుతున్నారు. ‘ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తే ఆహ్వానించాలి.. సిద్ధాంతపరమైన రాజకీయాలు చేసేవాళ్ళని స్వాగతిస్తాం.. అలాంటప్పుడు మంచి పోటీ వుంటుంది.. ఇంకా మెరుగ్గా పని చేయడానికి ఆస్కారం వుంటుంది..’ అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంకో వైపు, బీఆర్ఎస్ వల్ల రాష్ట్రంలో ప్రయోజనం ఏమీ వుండదంటూ ఏపీకి చెందిన పలువురు వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఎవరి గోల వారిది.!

కేసీయార్ పార్టీకే ఓటేస్తానంటున్న ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేస్తే, ఆ పార్టీకే తాను ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. ఓ ముఖ్యమంత్రి కేంద్రంలోని ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు మద్దతివ్వాల్సిన అవసరం వుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

కాగా, జాతీయ పార్టీ విషయమై ఉండవల్లి సలహాల్ని కూడా గతంలో కేసీయార్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయమని కేసీయార్, ఉండవల్లిని కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఎన్నికల్లో పోటీ చేయనుగానీ, అవసరమైన సలహాలు ఇవ్వడానికి తాను సిద్ధమేనని ఉండవల్లి కేసీయార్‌కి అప్పట్లో చెప్పారట.

ఏదిఏమైనా, తెలుగునాట కేసీయార్ ఆశించినట్లే రాజకీయ ప్రకంపనలు వస్తున్నాయి ఆయన జాతీయ రాజకీయం విషయమై.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us