Bendapudi School Ayamma : బెండపూడి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్.! టీడీపీకి షాకిచ్చిన ‘ఆయా’.!

NQ Staff - September 15, 2022 / 06:46 PM IST

Bendapudi School Ayamma  : బెండపూడి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్.! టీడీపీకి షాకిచ్చిన ‘ఆయా’.!

Bendapudi School Ayamma : ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ఎదగాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలమవడంలేదు. అయితే, వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఇంగ్లీషు మీడియంని ప్రోత్సహిస్తూ, ఈ క్రమంలో తెలుగు మీడియంని పక్కన పెట్టడంపై చాలా విమర్శలొచ్చాయి.

తెలుగు మీడియంని పూర్తిగా రద్దు చేయడంపై వివాదాన్ని పక్కన పెడితే, ఇంగ్లీషు మీడియంకి సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతున్నాయి. ఇంగ్లీషు పట్ల ప్రభుత్వ స్కూళ్ళలోని విద్యార్థుల్లోనూ ఆసక్తి, అవగాహన పెరుగుతున్నాయి. ఇంగ్లీషు పట్ల భయం పోతోంది కూడా.

బెండమూడి ప్రభుత్వ స్కూల్ ఆయా.. ఇంగ్లీషులే..

Bendamudi School Ayamma Speaks English

Bendapudi School Ayamma Speaks English

ఆయమ్మ కూడా ఇంగ్లీషులో మాట్లాడితే.. ఆ కిక్కే వేరప్పా. బెండపూడి స్కూల్ విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడటంపై గతంలో బోల్డన్ని ప్రశంసలు, కొన్ని వెటకారాల్ని చూశాం. టీడీపీ అనుకూల మీడియా అప్పట్లో ఆ స్కూల్ విద్యార్థులపై చేసిన వెటకారాలు అన్నీ ఇన్నీ కావు.

ఇప్పుడేమో, ఆ స్కూల్ ఆయమ్మ కూడా ఇంగ్లీషు మాట్లాడుతోంది. దీన్ని టీడీపీ అనుకూల మీడియా జీర్ణించుకోలేకపోతోంది. రాజకీయ విమర్శలు ఇలాంటి సందర్భాల్లో అస్సలేమాత్రం సబబు కాదు. కష్టపడి ఇంగ్లీషులో మాట్లాడటం నేర్చుకుని, ధైర్యంగా ఆమె కెమెరా ముందు మాట్లాడిందంటే, ఖచ్చితంగా ఆమె సంకల్పాన్ని అభినందించి తీరాల్సిందే.

నిజంగానే, ఆ మహిళ చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుందనడం నిస్సందేహం. ప్రతిదాన్నీ రాజకీయ కోణంలో చూడటం టీడీపీకి అలాగే టీడీపీ అనుకూల మీడియాకి అలవాటైపోయింది.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us