Bandaru Satya Narayana : ఫ్రస్ట్రేషన్ లో టీడీపీ నేతలు.. గాడి తప్పిన మాటలు..!

NQ Staff - September 30, 2023 / 12:26 PM IST

Bandaru Satya Narayana : ఫ్రస్ట్రేషన్ లో టీడీపీ నేతలు.. గాడి తప్పిన మాటలు..!

Bandaru Satya Narayana  :

టీడీపీ నేతల తీరు చూస్తుంటే.. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పుడు టీడీపీకి దశా, దిశ లేకుండా పోయాయి. ఎటు వైపు వెళ్లాలో.. ఎవరిని ఫాలో అవ్వాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎందుకంటే పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు వెళ్లి జైల్లో కూర్చున్నాడు. చంద్రబాబు తర్వాత తానే అని బిల్డప్ ఇచ్చుకున్న నారా లోకేష్ ఢిల్లీలో పరారీలో ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితులు. బాలయ్య ఏదేదో మాట్లాడి పార్టీని ఆగం చేసేస్తున్నాడు. అందుకని ఆయన్ను కూడా నోరు తెరవొద్దని చంద్రబాబు జైలు నుంచి ఆదేశించారంట.

దాంతో ఎమ్మెల్యే స్థాయి నేతలు, మాజీ మంత్రులు కూడా తమ నోటికి పని చెప్పట్లేదు. ఓ ప్రెస్ మీట్టి పాయింట్లు మాట్లాడాలంటే వారికి భయమేస్తోంది. ఎందుకంటే కోర్టుల్లో సాక్ష్యాధారాలు బలంగా ఉంటున్నాయి. అందుకే చంద్రబాబుకు వరుసగా రిమాండ్ లు విధిస్తున్నారు. అందుకే చంద్రబాబు కేసుపై ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితుల్లేవు. దాంతో అందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక క్యాడర్ అయితే నిరసనలు, ధర్నాలు చేసి అలసిపోయారు. అందుకే చంద్రబాబు కోసం రోడ్డెక్కే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే చంద్రబాబు తప్పు చేశారని వారు కూడా నమ్ముతున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నాయకులు మాత్రం ఏదేదో మాట్లాడేసి అధిష్టానం దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన పని చేసిన బండారు సత్యనరాయణమూర్తి మంత్రి రోజా మీద చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల ఫ్రస్ట్రేషన్ కు అద్దం పడుతున్నాయి. రాయడానికి కూడా వీలులేని విధంగా ఒక మహిళా మంత్రి మీద ఆయన బూతు పురాణాలు అలా ఉన్నాయి. దాన్ని కూడా ఆయన ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన ప్రసంగాన్ని చూస్తుంటే అసలు టీడీపీ పార్టీ ఎటువైపు వెళ్తుందో స్పస్టంగా అర్థం అవుతోంది.

ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యవహారాలు చూసుకుంటున్న నారా బ్రాహ్మణి, భువనేశ్వరి దృష్టిలో పడేందుకు కొందరు టీడీపీ నేతలు హద్దులు దాటిపోయి మరీ మాట్లాడుతున్నారు. బండారు వంటివారు తమ స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో పాటు అయ్యన్న పాత్రుడు కూడా బాలయ్య గొప్ప సంస్కార వంతుడు అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.

ఆడవారు కనిపిస్తే ముద్దులు పెట్టాలి, లేదంటే కడుపులు చేయాలి అని చెప్పిన బాలయ్యను రోజా విమర్శించొద్దు అనడం మతిస్థిమితం లేని మాటల్లాగా అనిపించక మానవు. ఒక మహిలా మంత్రినే ఇలా బూతులు తిడుతుంటే.. ఇక సాధారణ మహిళలకు వీరు గౌరవం ఇస్తారా అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. రాను రాను ఆ పార్టీలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్లి.. ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us