Balakrishna : ఎన్నికల సమయంలో ఈ రచ్చ ఏంది బాలయ్య.. బాబు అసహనం

NQ Staff - January 25, 2023 / 08:02 PM IST

 Balakrishna : ఎన్నికల సమయంలో ఈ రచ్చ ఏంది బాలయ్య.. బాబు అసహనం

Balakrishna  : నందమూరి బాలకృష్ణ పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశాడు అంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా యొక్క విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ నోరు జారి ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కనేని అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆ వ్యాఖ్యలు ఎస్వీ రంగారావు యొక్క సామాజిక వర్గంతో పాటు అక్కినేని ఫ్యాన్స్ లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఒక వైపు ఆయన్ని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం తెలుగు దేశం పార్టీ నుండి ఆయనను బహిష్కరించాల్సిందే అంటూ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నారట.

ఎన్నికలు సరిగ్గా సంవత్సరం కూడా లేవు.. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ సమయంలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న మీరు ఎంతో బాధ్యతగా ఉండాలి.

మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ బాలకృష్ణకు చంద్రబాబు నాయుడు సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీకి ఎలాంటి చిన్న నష్టం జరిగినా కూడా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే బావమరిదికి బాబు క్లాస్ పీకి ఉంటాడు అనేది రాజకీయ వర్గాల్లో టాక్.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us